దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం చేయడమే బిఆర్ఎస్ లక్ష్యం….

నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం లో ఎమ్మెల్సీ కవిత..
నిజామాబాద్ బ్యూరో,అక్టోబర్ 10(జనంసాక్షి): దేశంలో ఉన్నటువంటి బీసీలకు పూర్తిగా న్యాయం చేయడమే బిఆర్ఎస్ లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు మంగళవారం నిజామాబాద్ నగరంలో నాయి బ్రాహ్మణ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా హాజరైన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో బి సి లను ఎందుకు పట్టించు కోలేదో రాహుల్ గాందీ సమాధానం చెప్పాలన్నారు.
నాయి బ్రాహ్మణులు అంటే విట్టలేశ్వరుని కే క్షవరం చేసిన చరిత్ర ఉందన్నారు.అశ్విని దేవతల వారసులు నాయి బ్రాహ్మణులు అన్నారు.
నాయి బ్రాహ్మణులు లేకుంటే సమాజానికి ఎంతటి ఇబ్బంది ఉంటదొ సీఎం కేసీఆర్ ఎన్నో సార్లు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించారన్నారు.నాయి బ్రాహ్మణుల కుల వృత్తిని కాపాడేందు కు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల సెలూన్ లకు సబ్సిడీ విద్యుత్అందిస్తున్నామని,
కుల వృత్తులు ప్రోత్సహిస్తూ మరో వైపు విద్య కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామమ్మారు.
12 లక్షల కళ్యాణ లక్ష్మి లబ్ధి దారుల్లో 7 లక్షలు బిసి లబ్ధిదారులు ఉన్నారన్నారు.

గతం లో పనిచేసిన ప్రభుత్వాలు బి సి లను ,కులవృతుల ను నిర్లక్షం చేశాయన్నారు.కేసీఆర్ ప్రభుత్వం కుల వృత్తులు ప్రోత్సహిస్తూ .మరో వైపు విద్యాపరంగా ఎంతో ప్రోత్సాహం అందిస్తుందన్నారు.
బిసి లకు 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీ లో మొట్ట మొదట తీర్మానం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు.

60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హాయం లో బిసి గణన ఎందుకు జరగలేదు రాహుల్ గాందీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దేశం లో ఉన్న బిసి లకు న్యాయం జరగాలన్నారు.రెండు సార్లు ఆశీర్వదించి గెలిపించారు .మళ్లీ బి అర్ ఎస్ పార్టీని భారీ మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.