దేశానికి అన్నపూర్ణగా మారిన తెలంగాణ
` కడగండ్ల నుంచి పుట్లకొద్దీ ధాన్యం పండిస్తున్న తెలంగాణ రైతు
` రైతు సంక్షేమం, నీటివసతి, ధాన్యం కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
` 9 ఏండ్లలో 1.31 కోట్ల నుంచి 2.20 కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం
` సాగునీటి ప్రాజెక్టులకు రూ.1.59 లక్షల కోల్లు ఖర్చు చేసిన ప్రభుత్వం
` మిషన్ కాకతీయ కింద రూ.5249 కోట్లతో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, పటిష్టత
` 68 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 2.7 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగిన ధాన్యం దిగుబడి
` వ్యవసాయానికి ఉచిత విద్యుత్ , ధాన్యం కొనుగోలు, రైతుబంధు , రైతు భీమా, రుణ మాఫీ లాంటి పథకాల అమలుతో రైతులకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ ఏర్పాటుతో రైతుల కడగండ్లు తీరాయి. ఒకనాటి బంజరు భూములు , నేడు జవసత్వాలు నింపుకుని పచ్చని పంటలతో కళ కళళలాడు తున్నాయి. ఉద్యమ నేత, స్వయంగా రైతు అయిన శ్రీ కె చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావడంతో తెలంగాణ వ్యవసాయ రంగంలో సువర్ణాద్యాయం ప్రారంభమైనది. ఉమ్మడి పాలనలో జరిగిన వివక్ష, తెలంగాణ రైతుల ఇబ్బందులపై ఉన్న అవగాహనతో పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే వ్యవసాయ రంగం పునరుజ్జీవనం కు సాగునీటి వసతి కల్పించడమే ఏకైక పరిష్కారం అని విశ్వసించి తెలంగాణకు కేటాయించబడిన గోదావరి కృష్ణా జలాల ను పూర్తిగా వినియోగించుట కు అసంపూర్తిగా వదిలివేసిన ఎస్ ఆర్ ఎస్ పి వరద కాలువ లాంటి ప్రాజెక్టులతో పాటు కాళేశ్వరం , పాలమూరు` రంగారెడ్డి భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కు 9 సంవత్సరాల్లో రూ.1.59 లక్షలు కోట్లను ప్రభుత్వం వ్యయం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు కాలంలో పూర్తి చేసినీ ది. మిషన్ కాకతీయ కింద రూ 5249 కోట్లను ఖర్చు చేసి కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించినది. ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధతో2014 నాటికి సాగు విస్తీర్ణం కోటీ 31 లక్షల ఎకరాలు కాగా 2022`23 నాటికి అది 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు ఆలాగే 2014`15 నాటికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉండగా, 2022`23 నాటికి రికార్డు స్థాయిలో సుమారు 2.70 కోట్ల టన్నులకు చేరుకున్నది. ? 2014`15 లో పత్తి సాగు విస్తీర్ణం 41.83 లక్షల ఎకరాలు ఉండగా, 2020`21 నాటికి(44.70 % వృద్ధి) 18.70 లక్షల ఎకరాలు పెరిగి 60.53 లక్షల ఎకరాలకు చేరుకున్నది. ? 2014`15 లో పత్తి దిగుబడి 35.83 లక్షల బేళ్లు ఉండగా, 2020`21 నాటికి 63.97లక్షల బేళ్లకు చేరుకున్నది. ? పండిరచిన ధాన్యం మొత్తాన్ని రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణ మాత్రమే. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈనాటి వరకు రూ. 1 లక్షా 33 వేల కోట్ల ను భరించి 722.92 లక్షలమెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది.అలాగే ధాన్యం కాకుండా రూ.11,437.55 కోట్లతో ఇతర పంటల ను కొనుగోలు చేసింది. వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్నది. 27.49 లక్షల వ్యవసాయ కనెక్షన్లు కు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ది. అందుకు అనుగుణంగా రూ.32,700 కోట్లు వెచ్చించి విద్యుత్ మౌళిక సదుపాయాలు విస్తరించింది.ఉచిత విద్యుత్ సరఫరా కు సాలీనా దాదాపు రూ.10,500 కోట్లు భరిస్తున్నది. వడ్డీ వ్యాపారులు కభంద హస్తాల నుంచి రైతులను కాపాడుటకు రైతు బంధు పథకం ను అమలు చేస్తున్నది.రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పు నగత 10 విడతలలో రూ.65 వేల 190 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేసింది.11 వ విడతగా ఈ వానాకాలంలో ఇప్పటివరకు 64.49 లక్షల రైతులకు, 117.08 లక్షల ఎకరాలకు, రూ.5854.16 కోట్లు ను రైతు బంధు సాయం గా అందించింది. రైతులకు అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించుటకు రైతు రుణ మాఫీని ప్రభుత్వం అమలచేస్తున్న ది.ఇప్పటి వరకు రెండు విడతలలో రూ.17,351.47 కోట్లు రుణమాఫీ చేసింది. రూ 1 లక్ష వరకు రుణ మాఫీ చేయుటకు అనుగుణంగా ప్రభుత్వం ఇటీవల నే రూ 18 వేల కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిం ది. విధివశాత్తు మృతి చెందిన రైతు కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతు బీమా అమలు చేస్తున్నది. రైతు బీమా కింద 108051 మంది రైతు కుటుంబా లకురూ.5402’55 కోట్ల భీమా పరిహారం చెల్లిం చడం జరిగింది. ?వ్యవసాయ రంగం పునరుజ్జీవనం తో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. రాష్ట్ర తలసరి ఆదాయం 2014`15: రూ.1,12,162/`, ఉంటే, 2022`23 (అంచనా):రూ.3,17,115/` కు పెరిగింది.
ప్రతి 5 వేల ఎకరాలకు ఒక ఏఈఓ
ఒక్కొక్కటి రూ.22 లక్షల వ్యయంతో రూ. 572 కోట్లతో 2601 రైతు వేదికల నిర్మాణం చేసింది.సీజన్ కు ముందే రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్న ది? దేశానికి అవసరమయ్యే పత్తి విత్తనాలలో 50శాతం తెలంగాణాలోనే ఉత్పత్తి అవుతున్నాయి.ఇప్పటివరకు రూ. 928.68 కోట్లతో 39.98 లక్షల క్వింటాళ్ల రాయితీపై వివిధ రకాల పంటల విత్తనాలు సరఫరా చేసింది.విత్తనాల నకిలీకి, కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్టు అమలు చేస్తున్నది.? పంటలకు గిట్టుబాటు ధర కోసం ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది.క్రాప్ బుకింగ్ అవలంభిస్తున్న ఏకైక రాష్ట్రం గా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న ది.వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా, ఇప్పటివరకు మొత్తం రూ.963.26 కోట్లను వెచ్చించి 6.66 లక్షల మంది రైతులకు లబ్ది చేకూర్చడం జరిగినది.వ్యవసాయ ట్రాక్టర్లు 2014`15 94,537 ఉంటే, ప్రస్తుతం 3.52 లక్షలు. అయినాయి? 2014`15లో 6,318 హార్వెస్టర్లు అందుబాటులో ఉండగా ప్రస్తుతం 19,309 లకు చేరాయి.తెలంగాణ ఏర్పడిన తరువాత ట్రాక్టర్లపై రూ.273.5 కోట్ల రవాణా పన్ను మాఫీతో పాటు రాష్ట్రం ఏర్పడక ముందటి రూ.41.6 కోట్ల రవాణా పన్ను రద్దు చేసింది. గోడౌన్ ల సామర్థ్యం `2014`15: 39.01 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే, ప్రస్తుతం 73.82 లక్షల మెట్రిక్ టన్నుల కు పెరిగింది.? 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను రిజర్వేషన్ల ద్వారా భర్తీ చేస్తున్నది? సీజన్ కు ముందే ఏ పంటలు వేయాలో, రైతులకు సూచించడానికి మార్కెట్ రీసర్చ్ డఅనాలసిస్ వింగ్ ఏర్పాటు చేసింది? సూక్ష్మ సేద్యం ద్వారా రూ.2186.14 కోట్లతో సబ్సిడీతో 3.10లక్షల మంది రైతులకు లబ్ది చేకూర్చడం జరిగింది.రూ. 291.66 కోట్ల సబ్సిడితో 1324 ఎకరాలలో, 1190 రైతుల పాలీ హౌజ్ ల అభివృద్ధి చేసింది.పంట నష్ట పరిహారం కింద ఇప్పటివరకు మొత్తం రూ.1490.15 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ గా చెల్లించింది.పంట భీమాలో రాష్ట్ర వాటా రూ. 909.55 కోట్లు (2014`15 నుండి 2019`20 వరకు) భరించింది. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో భాగంగా ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంపుకై కృషి చేస్తున్నది. 2022`23 లోనే 82,372 ఎకరాలలో నూతనంగా ఆయిల్ పామ్ సాగు చేశారు.సాగు నీటి శిస్తు ను ప్రభుత్వం రద్దు చేసింది