దేశానికి ఆదర్శం మలుకనూర్‌ స్వకృషి డైయిరీ

భీమదేవరపల్లి, జూలై 27 (జనంసాక్షి) : ములుకనూర్‌ మహిళా సహకార డైయిరీ దేశానికి ఆదర్శ మని హుస్నాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ములుకనూర్‌ సహకార డైయిరీ 10వ వార్షిక మహాసభ డైయిరీ అధ్యక్షురాలు కడారి పుష్పలీల అధ్యక్షతన జరిగింది. డైయిరీ వార్షిక నివేదికను డైయిరీ జనరల్‌ మేనేజర్‌ మారుపాటి భాస్కర్‌రెడ్డి సభ్యులకు నివేదికను చదివి వినిపించారు. అనంతరం వారు మాట్లాడుతు ఈ డైయిరీ మహిళా సంఘం ఇతర రాష్ట్రాలలోని సంఘాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. పశువులకు దాన, గడ్డి గింజలు, నట్టల మందులు, ఇతరత్రా వాటిపై పశువుల పెంపకం ప్రత్యేక శ్రద్ధవహించి అధిక పాలు ఉత్పత్తిని పెంచాన్నారు. కోటి 1.90 లక్షల రూపాయలను సంఘసభ్యులకు బోనస్‌ రూపంలో ఇస్తున్నామన్నారు. అనంతరం అత్య్ధధిక పాలు డైయిరీకి అందించిన సభ్యులకు బహుమతులు అందజేశారు. ఇటీవల ప్రమాద వశాత్తు మరణించిన సభ్యుల  కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిట్టి సుమతి, భాషవేని గట్టమ్మ, చాడ వసుమతి, ఎదులాపురం కళావతి, సుంకరి శోభ, సత్తమ్మ, శోభారణి, విజయ, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.