దేశానికి తెలంగాణ ఆదర్శం
– ‘హరిత’ ఉద్యమంపై జవదేకర్ ప్రశంసలు
నిజామాబాద్,జులై6(జనంసాక్షి):
తెలంగాణలో మొక్కల పెంపకాన్ని హరిత ఉద్యమంగా పెద్ద ఎత్తున్న తీసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందనీయుడని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు.ఇది దేవానికే ఆదర్శమని ఆయన ప్రశంసించారు.
ఎన్నికల్లో ప్రజలు ర్యాలీ తీసినట్టుగా మొక్కల పెంపకానికి ప్రజలు ర్యాలీ తీయడం నిజంగా అభినందించదగ్గ విషయమన్నారు. ప్రజలు ర్యాలీగా వచ్చి మొక్కలు నాటడడం అరుదైన విషయమన్నారు. దేశంలో ఈ సీజన్‌లో మొక్కలు నాటడడం ఆనవాయితీ అని, అయితే తెలంగాణలో లాగా ఎక్కడా ఉద్యమస్ఫూర్తితో మొక్కలు నాటిన దాఖలాలు లేవన్నారు. ఇది దేశానికి ఆదర్శం కాబోతున్నాదని అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతె గ్రామంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేవకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని 12 ఏళ్లు తలకెత్తుకున్న కెసిఆర్ దానిని సాధించారని, ఇప్పుడు అదే స్ఫూర్తితో హరిత ఉద్యమాన్ని చేపట్టారని అన్నారు. ఏదైనా ఆయన ఉద్యమంగానే చేస్తారని అన్నారు. హరితహారం లాంటి కార్యక్రమంలో దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంతపెద్ద ఎత్తున లేదని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కొనియాడారు. మొక్కలు నాటిన ప్రజలు వాటిని తమ పిల్లల్లా సాకాలన్నారు. అప్పుడే లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే పదేళ్లలో రాష్ట్రంలో 33శాతం మొక్కలు నాటడం సాధ్యమవుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన ఉద్యమానికి ప్రజలందరూ మద్దతు పలికారని కేంద్రమంత్రిఅన్నారు. తెలంగాణ కోసం పార్లమెంటులో భాజపా మద్దతిచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అందుకే కెసిఆర్ ఇప్పుడు వచ్చిన తెలంగాణను అభివృద్ది చేసేందుకు ముందుకు సాగుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ హరితహారం కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని జవదేకర్ అన్నారు. సీఎం కేసీఆర్ హరితహారాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారు. ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటోంది. మొక్కలు నాటడమే కాదు.. చెట్టును కాపాడటం కూడా మన బాధ్యతే అని గుర్తించాలన్నారు. ప్రతీ మొక్కకు ట్రీ గార్డు పెడితేనే చెట్టు బతుకుతదని, 33 శాతానికి అటవీ సంపద పెంచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం గొప్పదని ప్రశంసించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ ఉద్యమ స్ఫూర్తితో నడిపించడం దేశంలో ఎక్కడా లేదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అడవుల సంరక్షణకు కేటాయించిన రూ. 35 వేల కోట్లు మరుగున పడ్డాయి. క్యాంపా నిధులన్నీ రాష్ట్రాలకు అందిస్తామని జవదేకర్ స్పష్టం చేశారు. తనకు తెలుగు వచ్చు.. కానీ నేను మాట్లాడిన తెలుగు విూకు అర్థం కాకపోవచ్చు అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. జై తెలంగాణ అంటూ ఉపన్యాసం ప్రారంభించారు. అందరికీ నమస్కారం అని తెలుగులో సంబోధించారు. సీఎం కేసీఆర్ జై తెలంగాణ.. జై తెలంగాణ అంటూనే తెలంగాణ సాధించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ ఉద్యమ స్ఫూర్తితో నడిపించడం దేశంలో మరెక్కడా లేదన్నారు. ఈ సందర్భంగా మోతె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సిఎం కేసీఆర్‌తో కలిసి, ప్రకాశ్ జవదేకర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగు రామన్న, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కవిత, బాల్క సుమన్, బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రమంత్రి తం ప్రత్యేక హెలిక్టాపర్‌లో నిజామాబాద్ జిల్లా వేల్పూరు చేరుకున్నారు. హరితహారం పథకంలో భాగంగా మోతె గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.