దేశానికి దిశానిర్దేశం చేసే నేత కెసిఆర్ మాత్రమే
రైతుబందు అందుకు తాజా నిదర్శనం: రేఖానాయక్
ఆదిలాబాద్,ఫిబ్రవరి2(జనంసాక్షి): టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండి అమలు రైతుబంధు ద్వారా దానిని అమలు చేసి చూపిందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. కేదం/-ర పథకానికి కెసిఆర్ సంకల్పమే జీవనాడి అన్నారు. రతైలుపై చిత్తశుద్ది కేసిఆర్‌కు మాత్రమే ఉందన్నారు. కెసిఆర్ మాత్రమే దిశానిర్దేశం చేసే నాయకుడిన అన్నారు. అలాగే పేద ప్రజలకు సామాజిక భద్రత కల్పిస్తోందని తెలంగాణ ప్రబుత్వం మాత్రమే అని ఎమ్మెల్యే రేఖానయక్ అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పేదలకు భరోసా కల్పతిస్తోందన్నారు. కల్యాణ లక్ష్మి పథకం బాలికల పాలిట వరం లాంటిదన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు కూడా కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించడం కోసం గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.