దేశాన్ని పాలిస్తున్నది మోదీ కాదు
– అద్వానీ వ్యాఖ్యలు సీరియస్‌గా తీసుకోవాలి
– విహెచ్
హైదరాబాద్,జూన్19(జనంసాక్షి):
దేశంలో ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉందంటూ బీజీపీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ చేసిన కామెంట్స్ సీరియస్‌గా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్లో వీహెచ్ మాట్లాడుతూ… దేశాన్ని పాలిస్తున్నది ఆర్‌ఎస్‌ఎస్ తప్ప నరేంద్ర మోదీ కాదని స్పష్టం చేశారు. దేశంలో ముస్లింలను భయబ్రాంతులకు గురి చేసి మత సామరస్యాన్ని దెబ్బతీయాలని ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్ కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.ఆరెస్సెస్, భజరంగ్‌దళ్‌లు దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని…అందుకే ఆడ్వాణీ ఎమర్జెన్సీ అన్నారని వీహెచ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అద్వానీ ఎమర్జెన్సీ వ్యాఖ్యలు చేశారని వీహెచ్ తెలిపారు. అవినీతి, బ్లాక్‌మనీ అంశాల్లో ఇరుక్కున్న లలిత్ మోదీని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర మంత్రి సుష్మా, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని వీహెచ్ ప్రశ్నించారు. యూపీఏ హయాంలో ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రులంతా రాజీనామా చేసిన సంగతిని ఈ సందర్భంగా వీహెచ్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ¬దాలో ఉన్న కేసీఆర్ సన్నాసి భాష మాట్లాడితే ఊరుకునేది లేదని హనుమంత్‌రావు అన్నారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ మరోసారి అలాంటి భాష మాట్లాడితే ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.