దేశాభివృద్దిలో విద్యార్ధులు భాగస్వాములు కావాలి

మహేశ్వరం జనం సాక్షి:విద్యార్ధులు ఉన్నత లక్ష్యాలు ఎచుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలనిమాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని కొంగర రావిర్యాల సమీపంలోని రీసర్చ్‌            సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) డిఫెన్‌ ల్యాబొరేటరీ స్కూల్‌ సిల్వర్‌ జూబ్లీ ఉత్సహలకు ముఖ్య అతిధిగా కలాం హజరయ్యారు. ఈ సందర్బంగా విద్యార్ధులనుద్థేశించి ఆయన ప్రసంగించారు. విద్యార్ధి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే దిశగా కష్టపడి చదివి దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. నిత్యం కొత్త విషయాలను తెలుసుకునేందుకు కృషి చేయాలని సూచించారు. సైన్స్‌, గణితంపై ఆసక్తి కనబర్చడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సాదించాలని చెప్పారు. విద్యార్థులు దేశానికి నవ నిర్మతలు కావాలన్నారు. అంతకు ముందు విద్యార్థులతో కలాం ముఖాముఖీగా మాట్లాడారు .జనరల్‌ నాలెడ్జిపై ప్రశ్నలు వేశారు. కవితలు, నీతి వాక్యాలను విద్యార్థులను అడిగి వారిచే చెప్పించారు. వీటీకి విద్యార్థులు సమాధానాలిచ్చారు. ‘ఎందరో మహనుభావులు..అందరికి వందనాలు’ అంటూ తెలుగులో మాట్లాడి అలరించారు. ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. స్కూల్‌కు కలాం కొన్ని విలువైన పుస్తకాలను ఉచితంగా బహూ కరించారు.పాఠశాలలో గ్రంథాలయం,ఎగ్జిబిషను ఆయన ప్రారంబించారు.