దొంగతనం కేసు పేరుతో వేధించడం వల్ల యువకుడి ఆత్మహత్య
ఖమ్మం: దొంగతనం కేసులో విచారణ పేరుతో పోలీసులు వేధించడంతో మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో జరిగింది. రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని గిరిధర్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో రూ. 4 లక్షలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనలో అతని ఇంట్లో పనిచేసే సాయి అనే యువకుడిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. దీంతో మనస్థాపానికి గురైన సాయి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం చనిపోయాడు. ఈ ఘటనపై ఆగ్రహించిన బంధువులు సాయి మృతదేహంతో గిరిధర్‌రెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు.