దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నిర్మించాలి

దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నిర్మించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, కురుమ సంఘం చేర్యాల మండల అధ్యక్షులు శెవల్ల రాజయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజారులో వారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు ఎదిరించి తుపాకీ తూటాలకు అమరత్వం పొందిన గొప్ప వీరుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని, దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి సభలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. దొడ్డి కొమురయ్య స్పూర్తితో పోరాడాలని పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, కురుమ సంఘం నాయకులు బండారి సిద్ధులు, శెట్టె కొమురయ్య, బండారి కనకయ్య, శెవల్ల చిన్న రాజయ్య, బండారి సిద్దయ్య, శెట్టె ఓజయ్య,తిగుల్ల కనకయ్య,గుడెపు సుదర్శన్, ఆరుగొండ మల్లేశం, గజ్జల సురేందర్, సకినాల బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.