దోషులుగా తేలిన నేతలపై జీవితకాల నిషేధం
` సుప్రీంలో పిటీషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన కేంద్రం
` అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, కేవలం ఆరేళ్ల నిషేధం సరిపోతందని నివేదిక
న్యూఢల్లీి(జనంసాక్షి):వివిధ కేసుల్లో దోషులుగా తేలిన నేతలపై జీవిత కాల నిషేధాన్ని విధించాలన్న అభ్యర్థను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కేసులో సదరు వ్యక్తిపై ఆరేళ్ల పాటు నిషేధం విధిస్తే సరిపోతుందని తెలిపింది. ఓ వ్యక్తిపై జీవిత కాల నిషేధం అనేది కఠినతరమని పేర్కొంది. అయితే రాజకీయ నేతలపై జీవిత కాల నిషేధం ఎన్నేళ్లు అనే దానిపై నిర్ణయాధికారం పార్లమెంట్‌దేనని ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఖరాకండిగా తేల్చి చెప్పింది. దోషులుగా రుజువు అయితే జీవితకాల నిషేధాన్ని విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రం తన అభిప్రాయాన్ని వివరిస్తూ.. సుప్రీంకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది.దోషులుగా తేలిన నేతలపై జీవిత కాలం నిషేధం విధించాలంటూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఆ క్రమంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తాజాగా తన అభిప్రాయాన్ని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది.