ద్వైపాక్షిక అంశాలపై జిన్‌పింగ్‌తో మోడీ చర్చలు
జహెన్స్‌బర్గ్,జూలై27(జనం సాక్షి): : బ్రిక్స్ సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో సమావేశమయ్యారు. ఇటీవలి సమావేశాల్లో ఇరువురు తీసుకున్న నిర్ణయాల అమలు సక్రమంగా ఉండాలని తీర్మానించారు. సరిహద్దుల మధ్య శాంతిని పరిరక్షించేందుకు ఇరు దేశాల సైనికులకు సరైన మార్గ నిర్దేశం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత పర్యటనకు రావాలన్న మోడీ ఆహ్వానాన్ని జిన్‌పింగ్ అంగీకరిస్తూ హర్షం వ్యక్తం చేశారు. రష్యా, దక్షిణాఫ్రికా, అంగోలా, అర్జంటీనా దేశాల అధ్యక్షులతో భేటీ అయిన మోడీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.