ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్.. వివేక్ వెంకట్ స్వామి.
తొర్రూర్ 20 సెప్టెంబర్ (జనంసాక్షి )
దేశంలో ధనిక రాష్ట్రం గా ఉన్న తెలంగాణ ను కేసిఆర్ తన అవినీతి పాలనతో అప్పుల కుప్పగా మార్చాడని , రాబోయే ఎన్నికల్లో కేసిఆర్ కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లికి బీజేపీ నేతృత్వంలో విముక్తి కాబోతుంది అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ వివేక్ వెంకట్ స్వామి తెలిపారు.తొర్రూరులో బీజేపీ తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు అయ్యే నాటికి దేశంలో ధనిక రాష్ట్రం గా ఉన్న తెలంగాణ నేడు 5 లక్షల కోట్ల అప్పులతో ఉంది అని, కేసీఆర్ కుటుంబం విచ్చలవిడిఅవినీతి పాలన,, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో దోపిడి కారణంగానే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు.డిల్లి లిక్కర్ స్కాం నుండి ప్రజల ధ్రృష్టిని మరల్చేందుకు గిరిజన రిజర్వేషన్ అంటూ మరో మోసానికి కేసీఆర్ రెడీ అయ్యాడు అని తెలిపారు.మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడం కోసమే ఈ డ్రామా అని,ఎన్ని నాటకాలు ఆడినా,టక్కటమార విద్యలు,గారడి మాటలు ఎన్ని చెప్పినా ప్రజలు కేసీఆర్ ను నమ్మె పరిస్థితి లేదని, ప్రజలంతా స్పష్టం గా ఉన్నారని హుజురాబాద్ లో ఏవిధంగా ప్రజలు తీర్పు ఇచ్చారో అదే పునరావృతం అవుతుంది అని మునుగోడు లో బిజెపి జెండా ఎగురవేయడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర తో ప్రజల్లో చైతన్యం వచ్చింది అని,రోజు రోజుకూ బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోంది అని తెలిపారు.కేసిఆర్ కుటుంబం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుండడంతో మతి భ్రమించి కేసీఆర్ బీజేపీ పై, ప్రధాని నరేంద్ర మోడీ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు.డిల్లీ లిక్కర్ స్కాం లో కేసీఆర్ కుటుంబ హస్తం ఉందని దోశులకు శిక్ష పడడం ఖాయం అని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య, జిల్లా నాయకులు పరుపాటి రాం మోహన్ రెడ్డి, రచ్చ కుమార్,జలగం వెంకన్న, అలిసేరి రవిబాబు, భిక్షం నాయక్, మంగళపళ్ళి యాకయ్య, పైండ్ల రాజేష్, రాయపురం రాజకుమార్,జలగం రవి, వినయ్ శర్మ, నూకల నవీన్,గంధం రాజు, నడిగడ్డ సందీప్, సిహెచ్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
—