ధరణి లోపలతో రైతులకు శాపాలు
:శామీర్ పేట్, జనంసాక్షి : ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణిలో ఉన్న లోపలతో భూ కబ్జా దారులకు వరంగా మారిందని బొమ్మరాసి పేట్ ధరణి భాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం శామీర్ పేట్ మండల కార్యాలయం ముందు బొమ్మరాసి పేట్ ధరణి లోపలతో భాధిత రైతులు ఆందోళన చేపట్టి ఎమ్మార్వో సత్యనారాయణ ను నీలదీశారు. మా భూములను సాదా బైనామ క్రింద బ్లాక్ చెయ్యడం కలెక్టర్, ఎమ్మార్వోల అవినీతి అని నినాదాలు చేశారు. మాకు సమాచారం తెల్వకుండా 20 స్లాట్ లను వెంటనే రద్దు చెయ్యాలని రైతులు డిమాండ్ చేశారు. పేద రైతుల కడుపు కొట్టి ఉన్నోడికి అధికారులు ఊడిగం చెయ్యడం సిగ్గు చెటన్నారు.అనంతరం ఎమ్మార్వో సత్యనారాయణ మాట్లాడుతూ.. బుక్ చేసిన స్లాట్ లను ఆపివేస్తానని పేర్కొన్నారు. పూర్తి ధర్యాప్తు చేసి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామయ్య, బాబుల్ రెడ్డి, రవికిరణ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
14ఎస్పీటీ -1: కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న రైతులు