ధర్మపురికి పోటెత్తిన భక్తులు

ధర్మపురి,సెప్టెంబర్‌2 జనం సాక్షి: జగిత్యాల జిల్లా ధర్మపురిలోని  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం శనివారం సందర్భంగా లక్ష్మీ నరసింహుడి దర్శనానికి భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో స్వామివారి దర్శనానికి క్యూలైన్లు నిండిపోయాయి. దీంతో నారసింహుని దర్శనానికి రెండు గంటల సమయం పడుతున్నది. తొలుతు గోదావరిలో స్నానమాచరించిన భక్తులు నేరుగా ఆలయానికి చేరుకున్నారు. ఇక్కడ గోదావరి స్నానం పవిత్రంగా భావిస్తారు.