ధర్మపురి గడ్డపై 7వసారి మంత్రి కొప్పుల
ధర్మపురి (జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ స్థాపించడంతో 2001లో పార్టీలో చేరిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆనాటి నుండి నేటి బి ఆర్ ఎస్ వెంట నడుస్తున్నారు, సీఎం కేసీఆర్ మరోసారి కొప్పుల ఈశ్వర్ కు ధర్మపురి నియోజకవర్గంగా శాసనసభ్యుడిగా టికెట్ వచ్చిన సందర్భంగా నియోజవర్గ బిఆర్ఎస్ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున రాయపట్నం చౌరస్తా నుండి ధర్మపురి అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు తదనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తదనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని,మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలత లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో మేళతాళాలతో స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం రెనవేషన్ కమిటి చైర్మన్ ఇందారపు రామయ్య కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేష వస్త్రం ప్రసాదం ఇచ్చి సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు ముత్యాల శర్మ , అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్ సంపత్ కుమార్ రాజగోపాల్ అర్చకులు నంభి నరసింహ మూర్తి, రెనవేషన్ కమిటి సభ్యులు , సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ పాల్గొన్నారు.