ధర్మపురి మున్నూరుకాపు నూతన అధ్యక్షుడిగా చీపిరిశెట్టి రాజేష్

 

 

 

 

ధర్మపురి( జనం సాక్షి) ధర్మపురి పట్టణ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు.స్థానిక మున్నూరు కాపు సంఘ భవనంలో అధ్యక్ష పదవికి పోటాపోటీ ఎన్నిక జరగగా అధ్యక్షుడిగా చీపిరిశెట్టి రాజేష్ ఎన్నికయ్యారు.మొత్తం 519 ఓట్లలో రాజేష్ కు 208, ఓట్లతో గెలవగా అందులో మెజార్టీ39, లసెట్టి మహేష్ కు 169,బండి మహేష్ కు 133 ఓట్లు రాగా 9 ఓట్లు చెల్లలేదు. మిగతా స్థానాల్లో ఏకగ్రీవంగా ప్రధాన కార్యదర్శి గా బండారి లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా సోంశెట్టి శివసాయి, స్తంభంకాడి మహేష్,ఆర్థిక కార్యదర్శిగా కాశెట్టి రాంబాబు,సంయుక్త కార్యదర్శులుగా ఒడ్నాల భూమేష్,పానుగంటి రవి,కార్యదర్శులుగా చల్ల రవి,బండారి తిరుపతి, చుక్క రవి,చుక్క భీంరాజ్,కార్యవర్గ సభ్యులుగా సోంశెట్టి శేఖర్,కాశెట్టి విజయకుమార్ లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారులుగా చెరుకు రాజన్న, సంగీ నర్సయ్య, బండి మురళి వ్యవహరించారు, ఈ కార్యక్రమంలో కులస్తులు పాల్గొన్నారు.