ధాన్యం కొంటారా.. కొనరా?
` డొంక తిరుగుడు వద్దు
` పంజాబ్ తరహాలో కొనండి
` సూటిగాచెప్పండి
` వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్
హైదరాబాద్,నవంబరు 9(జనంసాక్షి):ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) వద్ద భారీగా బియ్యం నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పినట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ. ‘‘ 3 లక్షల కోట్ల టన్నుల బియ్యం వృథాగా ఉన్నాయని గడ్కరీ చెప్పారు. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని కోరారు. ధాన్యం కొనలేమని కేంద్రం లేఖల ద్వారా రాష్ట్రానికి చెప్పింది. అదే విషయాన్ని నేరుగా ప్రజలకు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ఇన్నాళ్లూ కేంద్రం బాయిల్డ్ రైసు తీసుకోలేదా? అని ప్రశ్నించారు. ధాన్యం సేకరణలో కేంద్రానిది ముమ్మాటికీ వైఫల్యమేనని విమర్శించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల్లోనే డబ్బు చెల్లిస్తే.. కేంద్రం మాత్రం రాష్ట్రానికి 6 నెలల తర్వాత ఇస్తోందని మండిపడ్డారు. పంజాబ్‌లో కొన్నట్లే తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు.వడ్ల సేకరణ విషయంలో కేంద్రానిది ఘోర వైఫల్యమని అన్నారు.యాసంగి వడ్ల సేకరణ విషయంలో కేంద్రానికి స్పష్టత లేదుయాసంగి వడ్లను బాయిల్డ్ రైస్ కోసం ఇప్పటి వరకు కేంద్రం ప్రోత్సహించి ఇప్పుడు చేతులెత్తేసిందన్నారు. కేంద్రం బాయిల్డ్ రైస్‌కు ప్రోత్సాహం ఇచ్చినందునే దేశంలో ఇన్ని మిల్లులు ఏర్పడ్డాయన్నారు.ఏడేళ్లుగా కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డగోలుగా , సంస్కారహీనంగా మాట్లాడిరది, నిందించింది బీజేపీ నేతలు, ఎంపీలు ఇప్పుడు కిషన్ రెడ్డి బెదిరిస్తున్నారు అని సమస్యను పక్కదారి పట్టించడం ఆశ్చర్యకరమన్నారు. బీజేపీ బెదిరింపుల విషయం దేశమంతా తెలుసని,బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్వయంగా పలు మార్లు ట్విట్టర్లో విూడియాలో బీజేపీ ప్రభుత్వ వైఖరి వెల్లడిరచారన్నారు.ధాన్యం సేకరణ నుంచి ఆరు నెలల వరకు కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి నిధులు ఇచ్చే దాకా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొన్న వెంటనే రైతుకు డబ్బులు ఇస్తుందని.. ఆరు నెలల వరకు జరిగే నష్టం, వడ్డీ అంతా తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందన్నారు. దానిని భరించాలని కేంద్రాన్ని కోరినా చలనం లేదన్నారు. పంజాబ్ మాదిరిగా తెలంగాణ వడ్లు కేంద్రం ఎందుకు కొనదని ప్రశ్నించారు.ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రైతులు కేంద్రం సహకారం లేకుండా పండిస్తున్న పంటకు చేయూత ఇవ్వరా అని ప్రశ్నించారు.‘‘గతంలో కొనుగోళ్లు మద్యలోకి వచ్చాక కేంద్రం వచ్చే సారి యాసంగి వడ్లు కొనాలని అడగమని లేఖ ఇవ్వాలని కేంద్రం వత్తిడి చేసిందితెలంగాణలో యాసంగి వడ్లన్నీ బాయిల్డ్ రైస్ కోసమే వేస్తారుఈ విషయం తెలంగాణలో సామాన్య రైతుకు కూడా తెలుసు దేశంలో బియ్యం నిల్వలు పేరుకుపోయాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెబుతారువరి ధాన్యం పండిరచాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెబుతాడు .. వీరి ప్రభుత్వ వైఖరికి విరుద్దంగా చెబుతాడుతెలంగాణ రైతుల యాసంగి వడ్లు కొంటరా ? కొనరా ? కేంద్ర మంత్రిగా, తెలంగాణ వాసిగా కిషన్ రెడ్డి చెప్పాలి లేకుంటే భవిష్యత్ పరిణామాలకు విూరే బాధ్యత వహించాలివిూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని విూరు తెలంగాణ రైతులకు వివరించాలి’’ అని అన్నారు.మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ‘‘తెలంగాణ వడ్లు కొనాలని కేటీఆర్‌తో కలిసి ఢల్లీిలో పీయూష్ గోయల్‌ని కలిశాం.పంటల కొనుగోలు బాధ్యత కేంద్రానిది, రాజ్యాంగం ప్రకారం అది కేంద్రం బాధ్యత అని విజ్ఞప్తి చేశాం. దానికి పీయూష్ గోయల్ వెకిలినవ్వు నవ్వారు.. ఇప్పటికే నిల్వలు మురిగిపోతున్నాయి .. కొననే కొనం అని అన్నారు.మాది కొత్త రాష్ట్రం .. ఇప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం అని కోరినా పట్టించుకోలేదు .. క్రాప్ చేసుకోండి అని ఉచిత సలహాలు ఇచ్చారు.అప్పుడే ఈ విషయం విూద స్పందించాలి. కేంద్రాన్ని ఒప్పించాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కోరితే నోరు తెరవలే .. ఈ రోజు రైతులను రెచ్చగొడుతున్నారు.కేంద్రం కొనడం లేదు .. కొనే అవకాశం, నిల్వచేసే అవకాశం రాష్ట్రానికి ఇవ్వడం లేదు.బీజేపీ నేతలు వడ్ల కొనుగోళ్లపై కేంద్రమంత్రులను నిలదీయాలిజరగబోయే పరిణామాలకు విూరే బాధ్యత వహించాలి.పండిన ప్రతి గింజ కండీషన్ లేకుండా కొనుగోలు చేయాలి’’ అని అన్నారు.తెలంగాణ భవన్ లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.