ధాన్యం కొనుగోళ్లపై కెసిఆర్ పచ్చి అబద్దాలు
రైతులను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు
కేంద్రంపై నిందలు మోపుతున్న మంత్రులు
రారైస్ ఎంతయినా కొంటామని ముందే చెప్పాం
ఉప్పుడు బియ్యం కొనబోమన్న దానికి కట్టుబడ్డ కెసిఆర్
గతంలో సేకరించిన ధాన్యం ఇప్పటికీ తరలించలేదు
కెసిఆర్ తీరుపై మండిపడ్డ కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి
న్యూఢల్లీి,డిసెంబర్21( జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరణలో రైతులను అయోమయానికి గురిచేస్తోందని, నెపాన్ని కేంద్రంపైకి నెట్టి లబ్దిపొందాలని చూస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. ధాన్యం సేకరరణ విషయంలో కేంద్రం స్పష్టతతో ఉందని, ఎంత ధాన్యం అయినా కొంటామని చెప్పామని అన్నారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..గత రబీలో అదనంగా 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనేందుకు సీఎం కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని స్పష్టం చేశారు. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని కేవలం తెలంగాణకు మాత్రమే ఇచ్చామన్నారు. ఇప్పటివరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి తరలించలేదని మండిపడ్డారు. గత ఐదేళ్లలో ధాన్యం సేకరణ మూడు రెట్లు పెరిగిందన్నారు. ఇచ్చే ధరను కూడా 1.5 రెట్లు పెంచినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ అబద్దాలు చెబుతూ ప్రజలను,రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రా రైస్ ఎంత ఇచ్చినా కేంద్రం తీసుకుంటుందని గతంలోనే స్పష్టంచేశామన్నారు. రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని అన్నారు. కేంద్రంపై అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులను టీఆఎర్‌ఎస్ సర్కార్ గందరగోళానికి గురి చేస్తుందన్నారు. మంగళవారం పీయూష్ గోయల్ తో రాష్ట్ర బీజేపీ నేతల భేటీ ముగిసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. తాను ఢల్లీిలో లేని సమయంలో తెలంగాణ మంత్రులు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. కేంద్రంపై చేస్తున్న అసత్య
ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అన్నారు. తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ 5 రెట్లు పెంచాం. గత రబీలో 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనేందుకు ఒప్పందం. ఇప్పటికే నాలుగు సార్తు గడువును పొడగించాం. ఇప్పటికీ 14 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ,13 లక్షల టన్నుల రారైస్ ఇవ్వాల్సి ఉంది. తెలంగాణకు స్పెషల్ కేస్ కింద 20 లక్షల మెట్రిక్ టన్నులు బాయిల్ రైస్ కు అనుమతించాం. ధాన్యం కొనుగోలుపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ అబద్దాలు చెబుతుంది. ఖరీఫ్ ఎంత రా రైస్ ఇచ్చినా తీసుకుంటామని ఎన్నోసార్లు చెప్పాం. ఐదేళ్లలో కొనాల్సిన ధాన్యం కంటే మూడు రెట్లు ఎక్కువ కొన్నాం. నాలుగేళ్లకు సరిపడ బాయిల్డ్ రైస్ ఉన్నా.. రైస్ తీసుకుంటామని చెప్పాం. భవిష్యత్ లో బాయిల్డ్ రైస్ ఇవ్వమని కేసీఆర్ సంతకం చేశారు. మోడీ ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గత రబీలో సీఎం కేసీఆర్ ధాన్యాన్ని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ కొనబోమని తెలంగాణ ప్రభుత్వమే లేఖ రాసిందన్నారు. రా రైస్, బాయిల్డ్ రైస్ కలిపి 27.39 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా చేయాలన్నారు.ఎఫ్‌సీఐకి ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. భవిష్యత్‌లో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. సీఎం కేసీఆర్ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హుజురాబాద్ ఓటమి తర్వాతే కేసీఆర్ బియ్యం అంశం లేవనెత్తారన్నారు. మెడపై కత్తిపెట్టి రాయించుకున్నారని కేంద్రంపై దుష్పచ్రారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రా రైస్ ఎంత వస్తే అంత కొంటామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పారన్నారు. జనవరి నుంచి జులై 31 వరకు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు కేంద్రంతో ఒప్పందం చేసుకుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.