ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం నిర్లక్ష్య వైఖరి


` ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్‌ఎస్‌దే
` విూడియా సమావేశంలో మంత్రి పువ్వాడ, ఎంపీ నామా
ఖమ్మం,డిసెంబరు 11(జనంసాక్షి):ధాన్యం పండిరచిన రైతులకు నిరీక్షణ తప్పడం లేదని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ధాన్యం కొనుగోలు పక్రియను కేంద్రం ఇంకా ప్రారంభించకపోడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి విూడియాతో మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై కక్షసాధింపు చర్యలు ఎందుకని ప్రశ్నించారు. వరి కోతలు ప్రారంభమై పంట చేతికొస్తున్నా.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులను ఆందోళకు గురిచేస్తోందన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోతలు ప్రారంభమై ధాన్యం ఇళ్లకు చేరుతున్నాయని అన్నారు. ఉభయ జిల్లాల్లో వారంరోజుల క్రితం నుంచే రైతులు వరి కోతలు ప్రారంభించారని కానీ కేంద్రానికి మాత్రం ధాన్యాన్ని కొనాలన్న ఆలోచన లేకపోయిందన్నారు.రైతులు పండిరచిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనాలని డిమాండ్‌ చేశారు.
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని అన్నారు. పార్టీ విజయానికి పనిచేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికలు ఏవైనా గెలుపు తెరాస పార్టీ దే అని మంత్రి పువ్వాడ అన్నారు. జిల్లాలో ఏ ఎన్నికలు నిర్వహించినా గెలుపు తెరాస పార్టీదే గెలుపని, శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో విజయం కూడా తెరాస పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని వివరించారు. ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాత మధు మంచి ఆధిక్యంతో విజయం సాధిస్తారని ఎంపీ నామా నాగేశ్వరరావు చెప్పారు. ప్రజల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నా మని చెప్పారు. ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను టీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తున్నంని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణకు డిమాండ్‌ చేస్తే కేంద్రం పట్టించుకోలేదన్నారు. తమిళనాడులో జరిగిన హెలీకాప్టర్‌ ప్రమాదంలో ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ తో పాటు వారి సతీమణి మరో 11 మంది మరణించడం బాధాకరమన్నారు. బిపిన్‌ రావత్‌ మరణం దేశానికి తీరని లోటని, ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం 2నిమిషాల పాటు మౌనం పాటించారు.సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య , జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌ రాజ్‌ , డిసిసిబి ఛైర్మన్‌ కురాకుల నాగభూషణం మేయర్‌ పునుకొల్లు నీరజ , సూడా చైర్మన్‌ విజయ్‌ తదితరులు ఉన్నారు.

 

 

తాజావార్తలు