ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్
జగిత్యాల,డిసెంబర్15(జనంసాక్షి): తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. అలాగే వర్షౄలు ప డే అవకాశం ఉన్నందున మళ్లీ నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తుల తీసుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని తేమశాతంతో పనిలేకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులకు ఏమా త్రం నష్టం జరుగకుండా మద్దతు ధరను వారి ఖాతాల్లో జమచేయాలన్నారు. అంతేకాకుండా సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరించాలన్నారు. టీవల అక్కడక్కడ కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. వారం రోజుల్లో ఇంకా 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు రావాల్సి ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి ఈ సీజన్‌లో 2.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులను జమచేశామన్నారు. ధాన్యం సేకరణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.