ధాన్యం దిగుబడి పెరిగింది
హైదరాబాద్,మే25(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సీజన్ లో వరి ధాన్యం దిగుబడి అధికంగా వచ్చిందని పౌరసరఫరాల అధికారులు అన్నారు. 30 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినప్పటికీ.. ఇప్పటికే 28 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరించినట్టు చెప్పారు. సీజన్ పూర్తయ్యేలోగా 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వరి దిగుబడి అధికంగా రావడంతో అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. ఆయా జిల్లాల్లో ధాన్యం సేకరణ, రైతులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.