ధీటుగా ఎదుర్కొన్నారు

5

– పఠాన్‌ కోటను సందర్శించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,జనవరి9(జనంసాక్షి): ఉగ్రవాదులు దాడిచేసిన పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ను  ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరిన మోదీ పఠాన్‌కోట్‌ చేరుకున్నారు. ఇటీవల ఇక్కడ జరిగిన ఉగ్రవాద దాడి ఘటనను ఆర్మీ, ఉన్నతాధికారులు.. మోదీకి వివరించారు. ఎయిర్‌బేస్‌ను  మోదీ పరిశీలించారు. ఇటీవల పఠాన్‌ కోట్‌ ఎయిర్‌ బేస్పై దాడి చేసిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ దాడిలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.  ఎయిర్‌బేస్‌పై దాడి జరిగిన ప్రాంతాన్ని ఏరియల్‌ సర్వే ద్వారా వీక్షించారు. ఉగ్రవాదుల దాడుల్లో గాయపడిన జవాన్లను మోడీ పరామర్శించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పఠాన్‌కోట్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో కూడా మోడీ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఈ నేపథ్యంలో సరిహద్దు వెంబడి భద్రతా దళాలు భద్రత కట్టుదిట్టం చేశారు. అనంతరం ఆర్మీ అధికారులతో మోడీ సవిూక్ష నిర్వహించారు. ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఆరుగురు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు.

పఠాన్‌కోట్‌ ఘటనపై పాక్‌కు అమెరికా సూచనలు

పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై పాకిస్థాన్‌కు అమెరికా పలు సూచనలు చేసింది. ఈ ఘటనపై క్రియాశీలంగా వ్యవహరించాలని, ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. గత వాగ్దానాలు నెరవేర్చుకునే సమయం వచ్చిందని అమెరికా తెలిపింది. దీనిపై తక్షణం చర్యలు తీసుకుని ఉగ్రమూకల భరతం పట్టాలని సూచించింది. పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడిపై పాక్‌ క్రియాశీలకంగా వ్యవహరించాలని అమెరికా సూచించింది. గత వాగ్దానాలు నెరవేర్చుకునే సమయం వచ్చిందని అమెరికా పేర్కొంది. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు బహిరంగంగానే కాక అంతర్గత భేటీల్లో పాక్‌ చేసిన హావిూలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీలైనంత త్వరగా పఠాన్‌కోట్‌ దాడి సూత్రధారులను పాకిస్థాన్‌ కోర్టు ముందు నిలబెట్టాలని పేర్కొంది. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై దాడి జరిగిన నాడే అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇదిలావుంటే పాక్‌ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ ఘటనపై ఉన్నతస్థాయి సవిూక్ష చేసింది.