పెళ్లే వ‌ద్దంటూన్న పెళ్లి కూతురు

  • ఒక్క‌రోజులో పెళ్లి పెట్టుకుని మ‌ళ్లీ అద‌న‌పు క‌ట్నం
  • గ‌ర్వ‌గా ఫీల‌వుతున్న‌ట్లు వ‌ధువు తండ్రి యోగేష్

క‌ట్నం అడిగిన‌వాడు గాడిదా అనే నీతివాక్యాలు త‌ర‌చూ చూస్తూ ఉంటాం..వింటూ ఉంటాం. పాట్నాలో ఇచ్చిన క‌ట్నం చాల‌క మ‌రింత ఎక్కువ‌గా డౌరీ డిమాండ్ చేయ‌డంతో అస‌లు త‌న‌కు పెళ్లే వ‌ద్దంటూ ధైర్యంగా చెప్పింది ఓ పెళ్లి కూతురు.

అస‌లు విష‌యానికొస్తే పాట్నాలోని గోపాల్‌గంజ్ జిల్లాకు చెందిన వ‌రుడి ఇంటికి వెళ్లారు పెళ్లి కూతురు త‌ల్లిదండ్రులు. పెళ్లికి మ‌రో రోజు ఉండ‌గా ముందురోజు జరిగే తిల‌క్‌ కార్య‌క్ర‌మానికి వారు వ‌రుడి ఇంటికి వెళ్లారు. అయితే పెళ్లికుమార్తె త‌ల్లిదండ్రుల‌కు ఇక్క‌డ చేదు అనుభ‌వం ఎదురైంది. ఇచ్చిన క‌ట్నం స‌రిపోద‌ని ఇంకాస్త ఎక్కువ‌గా డిమాండ్ చేశారు. ఒక్క‌రోజులో పెళ్లి పెట్టుకుని మ‌ళ్లీ అద‌న‌పు క‌ట్నం ఏమిట‌ని …ఇది భావ్యం కాద‌ని పెళ్లి కుమార్తె త‌ల్లిదండ్రులు వ‌రుడి త‌ల్లిదండ్రుల‌ను వేడుకున్నప్ప‌టికీ వారు విన‌లేదు. చేసేదేమీ లేక పెళ్లి కూతురికి ఫోన్ చేసి విష‌యం చెప్పారు. దీంతో పెళ్లి కూతురు క‌ట్నం కోసం వేధించే వారి ఇంట్లోకి అడుగుపెట్టేది లేద‌ని అక్క‌డి నుంచి వెంట‌నే తిరిగిరావాల‌ని త‌ల్లిదండ్రుల‌ను కోరింది. త‌న‌కు పెళ్లే వ‌ద్ద‌ని చాలా ధైర్యంగా చెప్పింది. కూతును నిర్ణ‌యానికి మ‌ద్ద‌తుగా నిలిచి  త‌ల్లిదండ్రులు ఏకంగా పెళ్లినే ర‌ద్దు చేసుకున్నారు. త‌న కూతురు తీసుకున్న నిర్ణ‌యం చాలా ధైర్యంతో కూడుకున్న‌ద‌ని తాము ఎంతో గ‌ర్వ‌గా ఫీల‌వుతున్న‌ట్లు వ‌ధువు తండ్రి యోగేష్ అన్నారు.

ఒక‌వేళ వారిని బ‌తిమలాడి త‌న కూతురును క‌ట్ట‌బెట్టి ఉంటే అద‌న‌పు క‌ట్పం కోసం వేధింపులు ఉండేవ‌ని ఆయ‌న అన్నారు. వ‌ధువు తీసుకున్న నిర్ణ‌యంపై పోలీసులు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. క‌ట్నం అనే జ‌బ్బునుంచి స‌మాజం బ‌య‌ట ప‌డాల‌ని పోలీస్ ఇన్స్‌పెక్ట‌ర్ స‌రితాకుమారి అన్నారు.