ధ్యాన్చంద్ ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు క్రీడల్లో రాణించాలి: ఎమ్మెల్యే మదన్ రెడ్డి.

2,కే రన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి జనం సాక్షి/ కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు సంతోష్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 2కె రన్ ను నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులు 2కే రన్ లో పాల్గొన్నారు విజేతలకు పాఠశాల వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బహుమతులు ప్రధానం చేశారు. క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని ప్రతి గ్రామంలో క్రీడాకారుల సౌకర్యార్థం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలని క్రీడలు మానసిక ఉల్లాసానికి దారుణ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ కొల్చారం జడ్పిటిసి సభ్యురాలు మేఘమాల సంతోష్ రంగంపేట సర్పంచ్ బండి సుజాత రమేష్, ఎంపీటీసీ సభ్యురాలు మాధవి రాజా గౌడ్ తుక్కాపూర్ సర్పంచ్ మాధవి శ్రీశైలం కోనాపూర్ సర్పంచ్ రమేష్ పైతర , పోతంశెట్టిపల్లి ఎంపీటీసీ సభ్యులు ఆదాం, భాగ్యమ్మ సిద్ధిరాములు, పోతంశెట్టిపల్లి ,కొల్చారం సర్పంచ్లు గడ్డమీద నాగరాణి నరసింహులు, ఉమా రాజా గౌడ్ బి ఆర్ ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు రవితేజ రెడ్డి , ఏడుపాయల ఆలయ కమిటీ డైరెక్టర్ ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాపరెడ్డి, డైరెక్టర్ తుక్కాపూర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.