నందిగామాలో తెదేపా ఆందోళన
నందిగాం: కృష్ణా డెల్టాకు సాగునీరు అందించాలని, విద్యుత్ కోతలను ఎత్తివేయాలని నందిగాం వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై తెదేపా ఆందోళన చేపట్టింది. స్థానిక ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావుతో పాటు మరికొందరు నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు ఎమ్మెల్యేతోపాటు నేతలను అదుపులోకి తీసుకొని నందిగాం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాస్తారోకోతో జాతీయ రహదారిపై సుమారు ఆరగంటకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.