నకిలీ బంగారం ముఠా అరెస్టు

 

గోదావరిఖని అసలు బంగారం నమ్మించి నకిలీ బంగారాన్ని అంటగట్టే ముఠా సభ్ములను జ్యొతినగర్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ మేరకు గోదావరిఖని డీఎస్పీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి వివరాలను వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్‌ 18 న షాలపత్లి గ్రామినిక చెందిన రంగు ప్రశాంత్‌ రూ. 3లక్షలు తీసుకోని నకిలీ బంగారాన్ని అంటగట్టారు. ఈ కేసులో హర్యానకు చెందిన హుస్సేన్‌ నవీన్‌లను పోలిసులు ఈ రోజు అరెస్టు చేశారు జాపర్‌ గ్యాంగ్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న మరో సభ్యుడు ఫక్రుద్దీన్‌ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.