నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడి

Untitled-1http://JanamSakshi.org/imgs/2015/01/untitled-12.jpg
పెద్దపల్లి: పెద్దపల్లిలో నకిలీ మద్యం తయారు చేస్తున్న దుకాణంపై అబ్కారీ శాఖ విజిలెన్స్‌ అధికారులు శనివారం ఉదయం దాడి నిర్వహించారు. అబ్కారీ అసిస్టెంట్‌ కమిషనర్‌ డి.శివనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం విజిలెన్స్‌ ఎస్‌ఐ వెంకట్‌ ఆధ్వర్యంలో సిబ్బంది పెద్దపల్లి బస్టాండ్‌ సమీపంలోని గెజిట్‌ నెం.123 మద్యం దుకాణంపై దాడి చేశారు. దుకాణం వెనుక గదుల్లో మద్యం సీసాల మూతలు తొలగించి వాటిలో నకిలీ మద్యం నింపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నకిలీ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దుకాణం లైసెన్స్‌దారుడు మహేష్‌, నిర్వాహకుడు పరమేశ్వర్‌లపై కేసు నమోదు చేసినట్లు శివనాయక్‌ తెలిపారు.