నక్సల్స్ సానుభూతిపరుల లొంగుబాటు
భద్రచలం: ఖమ్మం వెంకటాపురం, చర్ల మండలాలకు చెందిన సుమారు 148మంది మావోయిస్టు సానుభూతిపరులు జిల్లా ఎస్పీ హరికుమార్ ఎదుట లొంగిపోయారు. గత మూడు సంవత్సరాలుగా మావోయిస్టులు చేపట్టిన విధ్వంసకచర్యలకు వీరు సాయం చేశారు. వీరందరికి ప్రభుత్వం తరుపున అందించే సాయంతో పాటు కేసులు ఎత్తివేస్తామని ఎస్పీ హరికుమార్ తెలిపారు.