నక్సల్‌ రహిత ప్రాంతంగా.. నక్సల్‌ రహిత ప్రాంతంగా..  ఛత్తీస్‌గడ్‌ను తీర్చిదిద్దుతాం


– గిరిజనులు, రైతుల సంక్షేమానికి మరిన్ని పథకాలు
– కాంగ్రెస్‌ స్వలాభం కోసం రాష్ట్రంలో నక్సలిజాన్ని ప్రోత్సహించింది
– భాజపా జాతీయ కార్యదర్శి అమిత్‌షా
–  ఛత్తీస్‌గఢ్‌లో భాజపా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్‌షా, రమణ్‌సింగ్‌
రాయ్‌పూర్‌, నవంబర్‌10(జ‌నంసాక్షి) : ఛత్తీస్‌ఢ్‌ రాష్ట్రాన్ని నక్సల్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, ఆమేరకు భాజపా పనిచేస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. మరో రెండు రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో భాజపా ఎన్నికల మేనిఫెస్టోని శనివారం భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ రమణ్‌సింగ్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని నక్సల్‌ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. భాజపా పాలనలో ఛత్తీస్‌గఢ్‌ సంక్షేమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ వంటి పథకాలు అవినీతిరహితంగా ఉన్నాయన్నారు. గత 15ఏళ్లలో రమణసింగ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చిందని అమిత్‌షా అన్నారు. గిరిజనులు, రైతుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మరోవైపు లోర్మి ప్రాంతంలో భాజపా తరఫున ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘2022 నాటికి భారత్‌లోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇల్లు లేని వారు భాజపా పాలనలో గృహాన్ని పొందగలిగారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తమ స్వలాభం కోసం రాష్ట్రంలో నక్సలిజాన్ని ప్రోత్సహించిందని, కానీ భాజపా ప్రభుత్వం మాత్రం రాష్ట్రాన్ని నక్సల్‌ రహితగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిందన్నారు. రాజకీయ లాభం కోసం దేశ భద్రతను కాంగ్రెస్‌ ఉపయోగించుకుంటోందని విమర్శించారు.  కానీ భాజపాకు జాతీయ భద్రత చాలా ముఖ్యమని, జాతీయ భద్రతతో ఆటలాడుకునేందుకు ప్రయత్నిస్తే భాజపా ఎంతమాత్రం సహించబోదని సీఎం యోగి హెచ్చరించారు. నేటితో ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ పోలింగ్‌కు సంబంధించిన ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే భాజపా, కాంగ్రెస్‌ నేతలు ¬రా¬రీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.