నగరంలో రెండు రోజులు భారీ వర్షాలు

దెబ్బతిన్న రోడ్లకు తక్షణ మరమ్మత్తులు: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌
హైదరాబాద్‌,అక్టోబర్‌7 ( జనం సాక్షి ) :   హైదరాబాద్‌లో దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. అయితే మరో రెండు రోజులు వర్షాలుప్ర ఉన్నాయని అన్నారు. వర్షలకుచాలచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని అన్నారు. అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగరంలో తక్షణం చేపట్టాల్సిన పనులపై సవిూక్ష చేసి విూడియాతో మాట్లాడారు. ‘దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. నీరు నిలిచి ఉన్న దగ్గర ఆయిల్‌ బాల్స్‌ వేస్తున్నాం. వర్షానికి పడిన గుంతలను వెంటనే మరమ్మతులు చేస్తున్నాం. వర్షాల వల్ల గ్రేటర్‌లో చాలా చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. గంటకు రెండు సెం.విూ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే రోడ్లపై నీరు నిలుస్తుంది. జీహెచ్‌ఎంసీ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించి వాటిని వెడల్పు చేసే పక్రియ కొనసాగుతోంది. నగరంలో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నగరంలో డెంగీ కేసులో తగ్గిపోయాయని’ వివరించారు. ఇదిలావుంటే వరుసగా నాలుగోరోజు ఆదివారం జంటనగరాల్లో వర్షం కుమ్మేసింది. ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావానికి తోడు కొన్ని
ప్రాంతాల్లో ఉద్ధృతంగా కమ్మేసిన క్యుములోనింబస్‌ మేఘాలు మరోసారి సమ్మిళితమై కుమ్మేయడంతో ఆదివారం రాజధాని గ్రేటర్‌సిటీ నిండా మునిగింది. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల ప్రాంతంలో కుంభవృష్టి కురిసింది.  వర్షబీభత్సానికి నగరంలోని ప్రధాన రహదారులు ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగడంతో సవిూపంలోని బస్తీలు నిండా మునిగాయి. నల్లకుంట ప్రాంతంలో నాగమయ్య కుంట పొంగి సవిూపంలోని పద్మ కాలనీలోని ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించింది. ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు స్థానికులు నానా అవస్థలు పడ్డారు. మారేడ్‌పల్లి, ఇసామియాబజార్‌ తదితర ప్రాంతాల్లో భారీ చెట్లు నేలకూలడంతో చెట్ల కింద పార్కింగ్‌ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. రహదారులపై విరిగిపడిన చెట్ల కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌రెస్పాన్స్‌ బృందాలు రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టాయి. రాగల 24 గంటల్లో నగరంలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.