డబుల్‌ బెడ్‌రూంలు ప్రతిష్టాత్మకం

-నగరంలో లక్ష బెడ్‌రూంలు

– ఖర్చుకు వెనుకాడం

– మాట తప్పం

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,,ఆగష్టు 31,(జనంసాక్షి): పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో.. ఖర్చుకు వెనకాడకుండా సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకాన్ని చేపట్టారని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో లక్షఇళ్లు నిర్మిస్తామని హావిూ ఇచ్చారు. దీంతో హైదరాబాద్‌ను స్లమ్‌ఫ్రీ సిటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు . దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్నామన్నారు. మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా రాంపల్లిలో 6 వేలకు పైగా డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు మంత్రులు కేటీఆర్‌, మహేందర్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు, రాంపల్లిలో 6 వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం పట్ల మంత్రి మహేందర్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానసపుత్రిక డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకమని రాష్ట్ర పేర్కొన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకే అన్ని వసతులతో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోందన్నారు. మొత్తం 18 వేల కోట్లతో 2 లక్షల 65 వేల ఇళ్లను నిర్మిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ పథకం సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక అని అన్నారు. ఏ రాష్ట్రం.. ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన సీఎం కేసీఆర్‌ చేశారన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకే అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఉచితంగా నిర్మించి ఇస్తున్నమన్నారు. హైదరాబాద్‌ లో ఒక్కొక్క ఇంటికి అవుతున్న ఖర్చు 8 లక్షల 65 వేలన్నారు. మార్కెట్‌ లో ఆ ఇంటి ధర 30 లక్షలకు పైనే ఉంటుందన్నారు. మొత్తం 18 వేల కోట్లతో 2 లక్షల 65 వేల డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రం చేపట్టని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తున్నదన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నది.. దేశంలోనే సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ నెంబర్‌ వన్‌ అని అన్నారు.