నగరం చుట్టూ ఉద్యానవనాలు

ట్విట్టర్‌లో కెటిఆర్‌ వీడియో పోస్ట్‌
హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి):   మహానగరం చుట్టూ అర్బన్‌ లంగ్‌ స్పేస్‌ను ఏర్పాటు చేయనున్నామని మంత్రి కేటీ.రామారావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారీగా వనాలను, ఉద్యావనాలను అభివృద్ది చేయడం ద్వారా వాతావరణాన్ని రక్షించాల్సి ఉందన్నారు. రాష్ట్ర అటవీ శాఖ, పట్టణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా నగరం చుట్టూ 180 ప్రాంతాల్లో అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన రూపొందించిన ఒక వీడియోను ట్విట్టర్‌లో కేటీఆర్‌ పోస్టు చేశారు. నగరం చుట్టు పక్కల ప్రాంతాలు పచ్చదనంతో ఉండేలా, నగరవాసులు జీవన ప్రమాణాలు మరింత మెరుగ్గా ఉండేందుకు అర్బన్‌ లంగ్‌స్పే స్‌ల ఏర్పాటు చాలా అవసరమని గుర్తు చేస్తూ వీడియోను రూపొందించి ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

తాజావార్తలు