నగరాలు, పట్టణాల్లో ఎల్‌ఈడీ వెలుగులు
హైదరాబాద్,అక్టోబర్ 3(జనంసాక్షి):రాష్ట్రంలోని పట్టణాల్లో ఏల్ ఈ డీ లైట్ల ఏర్పాటుపైన మంత్రి కెటిరామారావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ రంగ సంస్ధ ఈ యస్ యస్ యల్ సంస్ధ యండి సౌరబ్ కూమార్ పాల్గోన్నారు. గత కొంత కాలంగా వివిధ పట్టణాల్లో చేపట్టిన ఏల్ ఈ డీ లైట్ల పంపణీ తీరువిూద మంత్రి ఈ సమావేశంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత మూడు నెలల్లో సూమారు నాలుగున్నర లక్షల లైట్లను పంపీణీ చేసినట్టు ఈ ఈ యస్ యల్ యండి తెలిపారు. అయితే ఈ ప్రక్రియను మరింత వేగంగా ముందుకు తీసుకుపోవాలన్నారు మంత్రి కెటి యార్ . రాష్ట్రంలోని మున్సిపాలీటీల్లో మెత్తం వీధి దీపాలను ఏల్ ఈ డీ లైట్లతో మార్చేందుకు చర్యలు తీసుకోవాలని సిడియంఏ దాన కీషోర్ ను అదేశించారు. ఈఈయస్ యల్ ప్రభుత్వ రంగసంస్ధతో ఈ మేరకు ఒక ఒప్పందాన్ని చేసుకోవాలన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కార్పోరేషన్లలో పూర్తి స్ధాయి విధీదీపాల ఏర్పాటును వేంటనే పరిశీలించాలని మంత్రి కెటియార్ అధికారులను కోరారు. జియచ్ యంసి పరిధిలోని మెత్తం 4.5 లక్షల వీధి దీపాలకు ఏల్ ఈ డీ లైట్లు బిగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జియచ్ యంసి కవిూషనర్ కు అదేశించారు. ఈ సమావేశంలోనే నగరంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు అమలు, ఫలితాల విూద కంపెనీ మంత్రికి వివరాలను అందజేసింది. నగరంలో ఏర్పాటు చేయబోయే ఈ లైటింగ్ వ్యవస్థలో అత్యాధునిక సౌకర్యాలుండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కంపెనీ యండిని కోరారు. వీటితోపాటు పోలీస్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేస్తున్న కెమెరాలు, వైవై సౌకర్యం వంటి అంశాల ఏర్పాటు పరిగణలోకి తీసుకుని ఈ ఏల్ ఈ డీ లైట్ల ఏర్పాటు చేయాలన్నారు. ఈ లైటింగ్ ఏర్పాటు సాద్యమైనంత వరకు స్ట్మార్ట్ గా ఉండాలన్నారు. ( అర్ధరాత్రి కొన్ని లైట్లు అటోమేటిగ్గా అరిపోవడం, డిమ్ కావాడం లాంటి) ఈ ఓప్పందం ప్రకారం ప్రస్తుత కరెంటు బిల్లుల్లో కనీసం 50 శాతం తగ్గేలా నిభందన ఉండాలన్నారు. ఈ మెత్తం ప్రక్రియను వచ్చే సంక్రాంతి నాటికి పూర్తి చేయలన్నారు. ఈ మేరకు కంపెనీ పూర్తి స్దాయి వర్క్ ఫోర్సుతో పనులు మెదలు పెట్టాలని మంత్రి కోరారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి నిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఈఈయస్ యల్ యండి సౌరబ్ కూమార్ , వచ్చే సంక్రాతి నాటికి నగరంలోని మెత్తం విధీ దీపాలకు ఏల్ ఈ డీ లైట్లు బిగించే
అంశాలన్ని సవాలుగా తీసుకుని పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో మెట్రో వాటర్ వర్క్ పంపునీటీ సెట్లకు అవుతున్న విద్యుత్ భారాన్ని తగ్గించుకునేందుకు అధునాతన ఏనర్జీ ఏపిసియంట్ పంపుసెట్లను వాడే అంశాన్ని పరిశీలించి ఒక నివేధిక ఇస్తామని మంత్రికి కంపెనీ యండి తెలిపారు. ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మెహన్, పురపాలక శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ యంజి గోపాల్, జియచ్ యంసి కవిూషనర్ జనార్ధన్ రెడ్డి , సిడియంఏ దానకిశోర్, ఈఈ యస్ యల్ బృంద సభ్యులు ఉన్నారు.