నగల దుకాణంలో సందడి చేసిన సలోని

హైదరాబాద్‌, జనంసాక్షి: అక్షయ తృతీయ సందర్భంగా బంగారాన్ని కొనుగోలు చేయడమంటే లక్ష్మిదేవిని ఇంటికి ఆహ్వానించడమేనంటోంది అందాల తార సలోని. సికింద్రాబాద్‌లోని మానేపల్లి నగల దుకాణంలో అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన వజ్ర ఆభరణాలను సలోని ఆదివారం ఆవిష్కరించింది. మోడల్స్‌తో కలిసి నగలను ప్రదర్శించిన సలోని వినియోగదారులను ఆకట్టుకుంది.