నటి ఆర్తి అగర్వాల్‌ అకాల మరణం

1

న్యూజెర్సీ/హైదరాబాద్‌,జూన్‌6(జనంసాక్షి): అనతి కాలంలోనే అశేష జనాదరణ పొందిన సినీనటి ఆర్తి అగర్వాల్‌ హఠాన్మరణం పాలయ్యారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఆర్తి అకాల మరణం పాలయ్యారు. 31 ఏళ్లకే ఆర్తి అగర్వాల్‌ మృతి చెందటంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి లోనైంది. ఆర్తి అగర్వాల్‌ కొంతకాలంగా స్థూలకాయం, శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నరు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందారు. ఉన్నట్టుండి ఆర్తి అగర్వాల్‌ లాంటి మంచి హీరోయిన్‌ మరణించడం తెలుగు సినీ పరిశ్రమకు షాక్‌ లాంటిదే. 31 ఏళ్ల వయసులో గుండెపోటు వస్తుందా అనే విషయం అనుమానంగానే అనిపిస్తోంది. అయితే గత కొంత కాలంగా స్థూలకాయంతోను, శ్వాసకోశ సమస్యలతోను బాధపడుతున్న ఆర్తి అగర్వాల్‌ మరణించిన విషయాన్ని ఆమె మేనేజర్తో పాటు ఆమె తండ్రి కూడా నిర్ధారించారు. ఇటీవల వరుసగా  అక్కినేని నాగేశ్వరరావు కేన్సర్‌ కారణంగా మరణించగా.. ఆ తర్వాత నుంచి శ్రీహరి, ఏవీయస్‌ , ధర్మవరపు సుబ్రమణ్యం, ఎంఎస్‌ నారాయణ ఇలా పలువురు నటులు ఇద్దరు దిగ్గజాలైన రామానాయుడు, విబి రాజేంద్రప్రసాద్‌   ఈ లోకాన్ని వీడిపోయారు. ఉదయ్‌కిరణ్‌ చిన్నవయసులోనే ఆత్మహత్య చేసుకోగా.. చక్రి మృతి కూడా అనుమానాస్పదంగానే మిగిలింది. ఆయన 40 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు.ఇలా పరిశ్రమకు చెందిన పలువురు మరణించడంతో ‘మా’ ఆధ్వర్యంలో ¬మాలు, పూజలు కూడా చేయించారు. దాంతో కాస్త ఊరట చెందుతున్న సమయంలో ఆర్తి మరణం మళ్లీ పరిశ్రమనుగ్భ్భ్రమకు గురిచేసింది.’నువ్వు నాకు నచ్చావ్‌’ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆర్తి అగర్వాల్‌ అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. యువ కథానాయకులు మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, తరుణ్‌, ఉదయ్‌కిరణ్‌, సునీల్‌ తదితరుల సరసన నటించి మంచినటిగా గుర్తింపు పొందారు. ఇంద్ర, పలనాటి బ్రహ్మనాయుడు, నువ్వులేక నేనులేను, అడవిరాముడు, అల్లరిరాముడు, అందాలరాముడు, నీస్నేహం, బాబి, వసంతం, సంక్రాంతి, నేనున్నాను తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. ఆమె చివరి చిత్రం రణం-2. పాగల్‌పన్‌ సినిమాతో బాలీవుడ్‌లోనూ ప్రవేశించారు. 2007లో గుజరాతీ ప్రవాస భారతీయుడు ఉజ్వల్‌ను వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం కూడా పలు చిత్రాల్లో నటించారు. తెలుగులో నటించిన తొలి చిత్రంతోనే మంచి కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక ఆర్తి అగర్వాల్‌. అందం, అభియనం కలగలిసిన ఆర్తి తెలుగులోని అగ్ర కథానాయకులందరి తోనూ నటించారు. 1984 మార్చి5న అమెరికాలోని న్యూజెర్సీలో జన్మించిన ఆర్తి.. ‘నువ్వునాకు నచ్చావ్‌’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అనేక విజయాలను సొంతం చేసుకుని టాలీవుడ్‌ మంచి పేరు తెచ్చుకున్నారు ఆర్తి. శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆమె శనివారం కన్నుమూశారు.

‘నువ్వు నాకు నచ్చావు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం

‘నువ్వు నాకు నచ్చావు’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆర్తి అగర్వాల్‌ అతి తక్కువ సమయంలో స్టార్‌గా ఎదిగారు. అలాగే ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. సినిమా కెరీర్‌ ప్రారంభించిన మొదట్లోనే చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, మహేష్‌బాబు, రవితేజ లాంటి అగ్రకథానాయకుల సరసన నటించారు.  ‘పాగల్‌ పన్‌’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తరువాత వెంకటేష్‌తో నటించిన నువ్వునాకు నచ్చావు భారీ విజయం సాధించడంతో టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకున్నారు. ఆ తర్వాత తరుణ్‌తో కలిసి నటించిన ‘నువ్వు లేక నేనులేను’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.  అగ్రకథానాయికగా ఉన్న సమయంలోనే కొన్ని వ్యక్తిగత

కారణాలతో రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం దాని నుంచి కోలుకొని 2006లో సునీల్‌ కథానాయకుడుగా వచ్చిన ‘అందాల రాముడు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మరికొన్ని సినిమాలలో కూడా నటించారు.  ఆర్తి అగర్వాల్‌ సోదరి అదితి అగర్వాల్‌ కూడా తెలుగులో కథానాయికగా రాణించారు.