నడవడానికి నారకంగా  సోమిర్యాగడ్ తండా రోడ్డు:

*మంజూరై ఆరు మసలైన పూర్తికాని సోమిర్యాగడ్ తండా బిటి సడక్*
*ఇబ్బందులు ఎదుర్కుంటున్న తండా వసూలు*
*ముందుకు సాగని ద్విచక్ర వాహనాలు*
*రానున్న గిరిజనుల పేద్ద పండుగ దసరా*
*అడుపుతాపితే అంతే …….తీవ్రగాయాలయ్యాయి
*రెండో లేయర్ వేసి తొందరగా పూర్తి చేయాలని కోరుతున్న తండా వసూలు*
యెల్లారెడ్డి(జనంసాక్షి)  కామారెడ్డి జిల్లా యెల్లారెడ్డి మండల సోమిర్యాగడ్ తండా కు సుమారు 75 సంవత్సరల కల  నెరవేరింది అనుకున్నామం ? ……కానీ గుత్తే దారులు వలన అది ఇంకా ఆలస్యం అవుతుంది అన్ని తండావాసులు  అంటున్నారు
*ఉగాది రోజు శంకుస్థాపన*
ఉగాది పండగ రోజున 29.03.2017 నాడు ఒక కోటి నాలబై ఐదు లక్షల(1.45) సోమిర్యాగడ్ తండా రోడ్డు ను ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు మరియు ఒక నెల రోజుల్లో పూర్తి చేయాలని గుత్తే దారులకు,ఆర్ & బి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు మొదటి దశ పనులు పూర్తి కాలేదు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందో అన్ని తండా వసూలు ఆవేదన వ్యక్తంచేశారు,ఏదైనా ఆపద జరిగేతే అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి అన్ని ఆవేదనతో పేర్కొన్నారు ఈ తండా యెల్లారెడ్డి నుండి 4 నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఎక్కడ ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో దవాఖాన గాని ఏమి లేవు
*స్కూల్ పిల్లలకు మరియు ఉపాధ్యాయులకు ఇబ్బంది*
ఈ తండా నుండి కాలి నడకన సుమారు 10 నుండి 15 మంది కాలేజ్ పిల్లలు,15 స్కూల్ పిల్లలు యెల్లారెడ్డి,గండిమాసానిపేట కు వారి చదువును అభ్యసించడానికి వస్తున్నారు వీరికి రోడ్డు బాగా లేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు,రోడ్డు బాగా లేక ప్రభుత్వ ఉపాధ్యాయులు తండాకు రావడానికి మొగ్గుచూపడం లేరు,సెప్టెంబర్ నెలలో ఉపాద్యాయుల బదిలీలు ఉన్నాయి అపట్లో గా రోడ్డు పనులు పూర్తి అయి తే తండా కు ప్రభుత్వ ఉపాద్యాయులు వస్తారు.ఇప్పుడు తండా స్కూల్ లో 75 మంది పిల్లలు ఉన్నారు కానీ అక్కడ 2 వి.వి.ఒక ఇంచార్జి ఉపాద్యాయుడు ఉన్నారు.
*15 మంది గర్భిణీ మరియు 10 బాలింతలు*
ఈ తండాల్లో  సుమారు 15 మంది గర్భిణీ స్త్రీలు,సుమారు 10 మంది బాలింతలరాలు ఉన్నారు,వీరికి ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు దవాఖానకు వెల్దామాన ఎక్కడ రాకపోకలకు సరిగా రోడ్ సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు తండా వాసుల ఈ రోడ్డుపై పై రెండోసారి డస్ట్ వేస్తే కొంత నాయం అవుతుంది అన్ని వారు స్పష్టంచేశారు.దీన్ని పాటించికోవలని తండా నాయకులు ఆవేదనను తెలిపారు
*పాటించొకొని రోడ్డు రవాణా శాఖ అధికారులు*
ఆర్ అండ్ బి అధికారులకు గిరిజన తండా రోడ్లు అంటే పాటింపులు ఉండటం లేదు ఉండదు కూడా అని తండా నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు గిరిజనుల అంటే అంత చులకనగా ఉంది అన్ని వారు ఆవేదన వ్యక్తంచేశారు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు లకు పెద్దపీట అన్ని     మాన ముఖ్యమంత్రి గారు వాగ్దానాలు చేస్తుంటే మాకు రావాల్సిన నిధులు ఎక్కడ దుర్వినియోగం చేస్తున్నారని వారు  ఆరోపించారు దీన్ని పై స్పందించి సోమిర్యాగడ్ బిటి రోడ్ తొందరగా పూర్తి అయే విదంగా చడాలని చెప్పారు.
*లకావత్ విజయ్ కుమార్*
మా తండా కు  బిటి రోడ్ అయిందని సంతోషంతో ఉన్నా కాని ,ఈ కంకరా తో మా ద్విచక్ర వాహనాలు ఈ కంకర వలన చెడిపోతున్నాయి కొద్దిగా దారీతపితే అంతే జారీ పడాల్సిందే.దీని పై స్పందించి రోడ్ పనులు తొందరగా అయే విదంగా చడాలిఅన్ని కోరుతనామ్.
*రామవత్ ఖిమ్యా నాయక్*
సారు మాకు రోడ్ మంజూరైదని చెపిన్నపుడు మా 70 సంవత్సరల బాధ తీరిందనుకున్న కానీ ఈ కంకరా కంటే పాత మట్టి రోడ్ డే ఉంటే బాగుండేది అనుకున్న నా టి.వి.యస్ బైక్ నాలుగో సార్లు టైర్లు కరబ్ అయినది,సారూ దయచేసి తొందరగా పూర్తి అయేలా చూడాలి .
సారు మాకు రోడ్ మంజూరైదని చెపిన్నపుడు మా 70 సంవత్సరల బాధ తీరిందనుకున్న కానీ ఈ కంకరా కంటే పాత మట్టి రోడ్ డే ఉంటే బాగుండేది అనుకున్న నా టి.వి.యస్ బైక్ నాలుగో సార్లు టైర్లు కరబ్ అయినది,సారూ దయచేసి తొందరగా పూర్తి అయేలా చూడాలి .