నడిఊరులో సర్పంచ్‌ వేలం

– పాట మూడోసారి..రూ.2.5 కోట్లు

నాసిక్‌,డిసెంబరు 30 (జనంసాక్షి):ఆస్తులు వేలం వేయటం గురించి మనలో చాలామంది వినే ఉంటారు. కానీ… ఆ గ్రామంలో మాత్రం సర్పంచి పదవికి వేలం నిర్వహించారు. ఈ పదవి కోసం ఒకరు ఏకంగా కోట్ల రూపాయలు వెచ్చించారు. మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా ఉమ్రానె గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామస్థులు అనధికారికంగా ఈ వేలం నిర్వహించిన ఈ వేలంలో రూ. 2.5 కోట్లు వెచ్చించి విశ్వాస్‌ రావ్‌ దేవరా అనే వ్యక్తి ఆ పదవిని దక్కించుకున్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జరిగిన వేలం రూ. కోటీ పదకొండు లక్షలతో ప్రారంభమైంది. ఎన్నికల ప్రక్రియ లేకుండా సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకే వేలం నిర్వహించారు. దేవరాను ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని గ్రామస్థులు ప్రకటించారు. వేలం ద్వారా వచ్చిన డబ్బుతో ఆ గ్రామంలో రామేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనున్నారట!