నడిరోడ్డు పై మహిళ దారుణహత్య
విజయనగరం : పట్టణం లోని కలెక్టరేట్‌కు సమీపంలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సిక్కుల కాలనీల కౌర్ కుటుంబసభ్యులు నివాసముంటున్నారు. ఆ పక్కనే రాంసింగ్ కుటుంబసభ్యులు నివాసముంటున్నారు.రాంసింగ్ అన్న కుమార్తెకు ఇటీవల మెదడువాపు వ్యాధి సోకింది. కౌర్ బాణామతి చేయడం వల్లనే ఈ వ్యాధిసోకిందని రాంసింగ్ కుటుంబం అనుమానించింది. దీంతో గురువారం సాయంత్రం నడిచి వెళుతున్న కౌర్ పై రాంసింగ్ కత్తితో దాడి చేసి హత మార్చాడు.