నడ్డా..తెలంగాణ కేసీఆర్‌ అడ్డా

` బిఆర్‌ఎస్‌ సెంచరీ ఖాయం
` దిమ్మతిరిగేలా పార్టీ మేనిఫెస్టో
` మంచిర్యాల పర్యటనలో మంత్రి హరీశ్‌రావు
మంచిర్యాల(జనంసాక్షి):బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. నడ్డా.. ఈ తెలంగాణ కేసీఆర్‌ అడ్డా అని మంత్రి తేల్చిచెప్పారు. మంచిర్యాలలో మంత్రి హరీశ్‌రావు వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. ఇవాళ బీజేపోళు కూడా బాగా మాట్లాడుతున్నారు. నిన్న నడ్డా అని ఒకాయన వచ్చిండు. ఆ నడ్డాకు తెల్వది.. ఈ తెలంగాణ కేసీఆర్‌ గడ్డా అని గుర్తు పెట్టుకోవాలి. నీ సొంత రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌లోనే బీజేపీని గెలిపించుకోలేకపోయావు. నువ్వొచ్చి ఈ తెలంగాణలో ఏం చేస్తవు నడ్డా? తెలంగాణ గడ్డ.. ఇది కేసీఆర్‌ అడ్డా.. అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.  సొంత రాష్ట్రంలో బొక్కబొర్లపడ్డా నడ్డా.. తెలంగాణలో బీజేపీని గెలిపిస్త అని మాట్లాడితే.. నీ నాటకాలు నడవవు అని నడ్డాను హరీశ్‌రావు హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ డకౌటే. బీజేపీ పోయినసారి ఒక్కటి గెలిచింది.. ఇప్పుడు ఆ ఒక్కటి కూడా రాదు గాక రాదు. ప్రపంచంలో లేని కమిటీలు వేస్తున్నవ్‌ కదా.. డిపాజిట్లు దక్కించుకునే ఓ కమిటీ వేసుకో అని సూచించారు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో 100 స్థానాల్లో డిపాజిట్లు రాలేదు.. కనీసం ఇప్పుడు డిపాజిట్లు అయినా వస్తే పరువైనా దక్కుతది. చేరికల కమిటీ అని ఒకటి వేశారు. అది అట్టర్‌ఫ్లాఫ్‌ అయిపోయింది. కనీసం డిపాజిట్ల దక్కించుకునే కమిటీ వేసుకొని.. బీజేపీ పరువైనా కాపాడుకోండి అని మంత్రి సూచించారు.  ఇంకొకాయన బీఎల్‌ సంతోష్‌ వచ్చి.. ఈ రాష్ట్రంలో హంగ్‌ వస్తదని అంటుండు.. మిస్టర్‌ సంతోష్‌ ఈ రాష్ట్రంలో హంగ్‌ కాదు.. హ్యాట్రిక్‌ కొడుతది బీఆర్‌ఎస్‌ పార్టీ. కచ్చితంగా కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి అయితడు అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. బీఎల్‌ సంతోష్‌ కర్ణాటకలో బీజేపీని భ్రష్టు పట్టించిండు.. ఇప్పుడు తెలంగాణలో భ్రష్టు పట్టించేందుకు వచ్చిండు. మంచిదే.. నీలాంటోడు వస్తే అయింత నామారూపాల్లేకుండా పోతది.. మాకేం రంది లేదు. కానీ హంగ్‌లు గింగ్‌లు రావు.. తెలంగాణలో హ్యాట్రిక్‌లే వస్తయి. విూ గుజరాత్‌లో మూడు మూడు నాలుగు నాలుగు సార్లు గెలవొచ్చు.. కానీ మా కేసీఆర్‌ తెలంగాణలో మూడు మూడు నాలుగు నాలుగు సార్లు గెలవొద్దా? విూ గుజరాత్‌ కంటే మా తెలంగాణ పాలన నూరుపాళ్లు నయం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
బిఆర్‌ఎస్‌ సెంచరీ ఖాయం
బీఆర్‌ఎస్‌ సెంచరీ ఖాయమని, పార్టీ ప్రకటించబోయే మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరగాల్సిందే అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మంచిర్యాలలో మంత్రి హరీశ్‌రావు వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెన్షన్లు ఎంత పెంచాలి.. రైతుబంధు ఎంత పెంచాలి.. మహిళలకు ఇంకా ఏం చేయాలని సీఎం కేసీఆర్‌ సమాలోచనలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో రాబోతోంది. ఆ మేనిఫెస్టో వచ్చిందంటే ప్రతిపక్షాల మైండ్‌ బ్లాక్‌ అవ్వాల్సిందేనని అన్నారు.  దిమ్మతిరిగిపోతది. కేసీఆర్‌ అంటే నమ్మకం, విశ్వాసం. కాంగ్రెసోళ్లు అంటే నయవంచన.. నాటకం. ఓట్ల కోసం మాయమాటలు చెబుతున్నారు. కొట్లాడుకునే సంస్కృతి వారిది. ఒక్క మాటలో కాంగ్రెస్‌ సంస్కృతి చెప్పాలంటే.. మాటలు, మూటలు, ముఠాలు, మంటలు. ఇది కాంగ్రెస్‌ పార్టీ సంస్కృతి అని మంత్రి తెలిపారు. అరచేతిలో వైకుంఠం చూపించి, కర్ణాటక నుంచి డబ్బులు సంచులు తెచ్చి గెలవాలని కాంగ్రెస్‌ పగటి కలలు కంటోంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్‌ ఉన్నంత కాలం కాంగ్రెస్‌ ఆటలు సాగవు. కేసీఆర్‌ హయాంలో కరువు లేదు.. కర్ఫ్యూ లేదు. కరువు, కర్ఫ్యూలు లేకుండా ప్రశాంతంగా పరిపాలన సాగుతుంది. నక్సలైట్లతో చర్చలు జరపుతామని చెప్పి వారిని మట్టుబెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది. ఆరు కిలోల బియ్యం, పగటి పూట కరెంట్‌ ఇస్తామని, తండాలను గ్రామపంచాయతీలు చేస్తామని చెప్పి మోసం చేశారు. వాళ్లు చేసిందేవిూ లేదు. కేసీఆర్‌ ఢల్లీిని కదిలించి తెలంగాణను సాధించారు. తెలంగాణ రాకపోతే కల్యాణలక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు వచ్చేవా అని హరీశ్‌రావు అడిగారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ డకౌట్‌, కాంగ్రెస్‌ రన్‌ అవుట్‌ ఖాయం, కేసీఆర్‌ సెంచరీ కొట్టడం ఖాయమని మంత్రి హరీష్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం చెన్నూరులో బీఆర్‌ఎస్‌ భారీ రోడ్‌ షోలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన వంద సీట్లతో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాబోతోందన్నారు. కర్ణాటక అవినీతి సొమ్ముతో కాంగ్రెస్‌ ఇక్కడ గెలవాలని అనుకుంటోందన్నారు. రేవంత్‌ రెడ్డి  10ఏళ్ల పాలనపై చర్చ అంటున్నారు. నీతో కాదు మాజీ ముఖ్య మంత్రులతో చర్చకు సిద్ధం. నాడు సోనియా గాంధీని బలిదేవత అన్న వ్యక్తి రేవంత్‌ రెడ్డి. రేవంత్‌ రెడ్డి రేపు ఏ పార్టీలోకి పోతడో తెలువదు. కాంగ్రెస్‌ అంటేనే మాటలు, ముఠాలు, మంటలు. హైదరాబాద్‌లో మతం మంటలు పెట్టిన పార్టీ కాంగ్రెస్‌‘ అంటూ వ్యాఖ్యలు చేశారు. గోదావరి వరదలపై సర్వే చేస్తామని.. అవసరమైతే కర కట్టలు కడతామని.. భూసేకరణ జరిపి రైతులను ఆదుకుంటామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

తాజావార్తలు