నన్ను అరెస్టు చేస్తే ఒక్కరోజులో టీ సర్కారు కూల్చేస్తా

4

ఢిల్లీలో బాబు ప్రదక్షిణలు

న్యూఢిల్లీ,జూన్‌10(జనంసాక్షి):

తనను అరెస్టు చేయడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తే.. అదే ఆయన ప్రభుత్వానికి చివరి రోజు అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులు, ప్రధాని, రాష్ట్రపతిని కలిసేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన.. అక్కడ జాతీయ విూడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాతు ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. తనను అరెస్టు చేస్తే కే సీఆర్‌ సర్కారుకు అదే చివరి రోజు అవుతుందని  వ్యాఖ్యానించారు. ఫోన్‌ సంభాషణకు తానెందుకు జవాబు చెప్పాలని ఆయన ఎదురు  ప్రశ్నించారు. అరెస్టుకు తానెందుకు భయపడాలనికూడా  బాబు ప్రశ్నించారు. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు నడవవు అని ఆయన గట్టిగానే హెచ్చరించారు. ఓటుకు నోటు వ్యవహారంలో ప్రతిష్ట కోల్పోయిన చంద్రబాబు.. కేసీఆర్‌ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు కేంద్రంలోని పెద్దలందరినీ కలుస్తున్నారు. ఇందుకోసం ఆయన ఓ ప్రైవేటు హాటల్లో బస చేశారు. ఫోను సంభాషణలు, ఇతర రికార్డులు అన్నింటినీ మార్చేశారని ఆయన ఆరోపించారు. తనను, తన పార్టీ నాయకులను భయపెట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంలో కేసీఆర్‌ పాత్ర ఏంటని ఆయన ప్రశ్నించారు. తన సంభాషణలను ఆయన రికార్డుచేసినా, ఆయన ఛానల్‌ చేసినా.. దానికి తానెందుకు సమాధానం చెప్పాలని బాబు అడిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి తనపై బురద జల్లుడు కార్యక్రమానికి పాల్పడుతున్నారని, రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం తానెంత ప్రయత్నించినా ఆయన ముందుకు రాలేదని చంద్రబాబు ఆరోపించారు. తనకు తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ ఉండటం.. ఉండకపోవడంలో పెద్ద ఆసక్తి ఏవిూ లేదని, కానీ కేసీఆర్‌ మాత్రం తన పార్టీని చీల్చి బలాన్ని పెంచుకుంటున్నారని అన్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి గవర్నర్‌ ఎలా అనుమతి ఇస్తారంటూ గవర్నర్‌ నరసింహన్‌ పాత్రపై కూడా ఆయన మండిపడ్డారు. తనపై తెలంగాణ ముఖ్యమంత్రి బురదజల్లుతున్నారని ఆయన అన్నారు.తనకు ఒక ఎమ్మెల్సీ పదవి తెలంగాణలో ఉండడం ,ఉండకపోవడం పెద్ద విషయం కాదని,కాని కెసిఆర్‌ తెలంగాణలో టిడిపిని చీల్చే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. ఇదిలావుంటే ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్న  చంద్రబాబునాయుడు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడితో బుధవారం ఉదయం సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై వారు చర్చించారు. విభజన చట్టంలోని సెక్షన్‌-8 అమలు అయ్యేలా చూడాలని వెంకయ్యను చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు ఉండేలా చూడాలని కోరినట్లు సమాచారం. తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఇకపోతే  ఉమాభారతితో పాటు, ప్రధాని మోదీతో చంద్రబాబు

సమావేశంకానున్నారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, జైట్లీని కలిశాక  రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో చంద్రబాబు భేటీ అవనున్నారు. ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అపాయింట్‌మెంట్‌ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.  మరోవైపు ఏపీ సీఎస్‌, డీజీపీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కేంద్ర క్యాబినెట్‌ సెక్రటరీ, ¬ంశాఖ సెక్రటరీతో వారు భేటీ కానున్నారు. విభజన చట్టంలోని లోపాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరోవైపు ఢిల్లీలోనే ఉన్న  గవర్నర్‌ నరసింహన్‌ రాష్ట్రపతితో భేటీకానున్నారు.

ప్రైవేట్‌ ¬టల్‌లో బాబు బస

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు సాధారణంగా బస చేసే ఏపీ భవన్‌లో కాకుండా ఓ ప్రైవేట్‌ ¬టల్లో దిగారు. ఓటుకు నోటు కేసు విషయంలో పలువురు ముఖ్యనేతలను ప్రైవేట్‌ గా కలుసుకోవడానికే ఇలా చేశారని సమాచారం. దీనిలో భాగంగా బుధవారం ఢిల్లీలో గంటకో కేంద్రమంత్రిని కలిసి ఓటుకు నోటు కేసులో ఆడియో టేపు విడుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేస్తున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు గవర్నర్‌ చేతికి ఇవ్వాలని కోరనున్నారు. అంతేకాకుండా గవర్నర్‌ నరసింహన్‌ పై కూడా ఫిర్యాదు చేయనున్నారు.  పలువురు ముఖ్యనేతలను కూడా కలుసుకోనున్నారు.