నన్ను ఆశీర్వదించండి నియోజవర్గ అభివృదే లక్ష్యంగా కృషి చేస్తాను పెద్దతండా గ్రామంలో నిరుపేదలకు ఇండ్ల స్థలాల పత్రాలను పంపిణీ చేసిన -ఎమ్మెల్యే రెడ్యా నాయక్ – శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రెడ్యా
డోర్నకల్/కురవి, జూలై/15/ జనం సాక్షి న్యూస్:
నన్ను ఆశీర్వదించండి నియోజవర్గ అభివృదే లక్ష్యంగా కృషి చేస్తాను డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్. కురవి మండలంలోని విలేజ్ గుండ్రాతిమడుగు, పెద్దతండా,బంగారి గూడెం గ్రామాలలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవ, శంకుస్థాపనలు చేసిన శాసనసభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్. రెడ్యాకు ఊరూరా డీజే సప్పట్లు, పూలమాలలు, శాలువాళ్ళతో సన్మానం చేసి ఘన స్వాగతం పలుకుతున్న గ్రామ ప్రజలు. విలేజ్ గుండ్రాతిమడుగు లోని శ్రీ ఆంజనేయ స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే రెడ్యా.అనంతరం ఊరేగింపుగా పలు గ్రామాలలో పర్యటించి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలే అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, క్యాబినెట్ కోటాలో సత్యవతి రాథోడ్ కు మంత్రి పదవి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని నియోజక వర్గ ప్రజలు మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని ఎమ్మెల్యే రెడ్యా అన్నారు. ప్రతి గ్రామాల్లో గృహ లక్ష్మి పథకం కింద రెండు పడకాల ఇండ్లు దసరా లోపే ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అదేవిధంగా పెద్ద తండాలో నిరుపేదలకు 44 ఇండ్ల స్థలాల మంజూరు పత్రాన్ని లబ్ధిదారులకు అందజేశారు.బంగారు గూడెం తండాలలో లిఫ్ట్ ఇరిగేషన్ కొరకు లక్ష రూపాయలు, చౌళ్ళతండా లో ప్రభుత్వ పాఠశాల పునర్ధరణ కొరకు రెండు లక్షల 50 వేలు నిధుల ఇస్తానని, కొంతమంది రైతుల లావణ్య పటాలు సమస్యలను పరిష్కరిస్తారని శాసనసభ్యుడు రెడ్యా నాయక్ అన్నారు. అదే కాకుండా ప్రతి గ్రామానికి ఎమ్మెల్యే కోటా కింద సిసి రోడ్డు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే రెడ్యా అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట లాలయ్య, ఎంపీపీ గుగులోత్ పద్మావతి రవి నాయక్,జిల్లా నాయకులు బజ్జూరు పిచ్చిరెడ్డి,సొసైటీ చైర్మన్ లు గార్లపాటి వెంకట్ రెడ్డి, దొడ్డ గోవర్ధన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ముండ్ల రమేష్, మాజీ ఎంపీపీ రామచంద్రయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, గ్రామ అధ్యక్షుడు గార్లపాటి భరద్వాజ్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు లక్ష్మణ్, గోపా, ఎంపీటీసీ లు జ్యోతి, బోజు నాయక్, మండల యూత్ అధ్యక్షుడు బానోతు రమేష్, సర్పంచులు జీవన్, మస్తాన్, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పెద్ది వెంకన్న,పేర్ల గణేష్,తోట రమేష్, అల్లూరి వాసు రాజు, రాము, రాజు నాయక్, సోషల్ మీడియా సూర్య, బానోత్ గణేష్, ఎంపీడీవో సరస్వతి, తాసిల్దార్ రఫీ, ఏవో మంజు ఖాన్, మండల పశువైద్యాధికారి బాదావత్ రామచందర్, మహిళలు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.