నరేంద్రమోడీకి వీసాపై అమెరికా మౌనం
వాషింగ్టన్: గుజరాత్ సీఎం నరేంద్రమోడీని దాదాపు దశాబ్దం కాలంపాటు ఆవాంచిత వ్యక్తిగా భావించిన బ్రిటన్ తాజాగా తన వైఖరిని సడలించుకోవటంతో ఇప్పుడు అందరీ దృష్టీ అమెరికా వైపు మల్లింది. బ్రిటన్ మాదిరిగానే అమెరికా కూడా తన వైఖరిని మార్చుకుని మోడీకి వీసా మంజూరి చేస్తుందా లేదా అనే విషయమై ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు అమెరికా విదేశీవ్యవహారాల (ప్రజాసంబంధాల)శాఖ సహాయ మంత్రి మైక్ హామర్ నేరుగా సమాధానమివ్వలేదు. మోడీ పేరును ప్రస్తావించగానే అమెరికా చట్టాల ప్రకారమూ ఏ విసా దరఖాస్తునైనా మదింపు చేయటం జరుగుతుంది. ప్రత్యేకించి ఓ వ్యక్తి విషయమై దీనిని పరిశీలించమనే విషయం మీకు తెలుసుకదా అని తెలిపారు. అంతకు మించి ప్రత్యేకంగా చెప్పేదేమి ఉండదని విలేకరులతో అన్నారు.