నర్సరావు పేటలో నేడు బంద్‌ నేటి రాత్రి వరకూ 144 సెక్షన్‌ అమలు

నర్సరావుపేట: గుంటూరు జిల్లా నర్సరావుపేటలో తెలుగుదేశం  పార్టీ ఆధ్వర్యంలో నేడు బంద్‌ పాటిస్తున్నారు. ఈమేరకు స్వఛ్ఛందంగా దుకాణాలు మూసివేయాలని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పిలుపునిచ్చింది. ఆదివారం జరిగిన పోలీసుల లాఠీచార్జీ, కోడెల అరెస్ట్‌ నేపథ్యంలో బుధవారం బంద్‌ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. వాస్తవానికి తెదేపా సోమవారమే పట్టణంలో బంద్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ  క్రీస్మన్‌ నేపథ్యంలో బుధవారానికి వాయిదా వేశారు. ఈరోజు రాత్రి వరకూ నరసరావుపేటలో  144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. దీంతో ప్రదర్శనలు, సభలు, సమావేశాలపై పోలీసులు అంక్షలు విధించారు. యలమంద, పిట్లూరివారిపాలెం వద్ద తెదేపా కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు.

తాజావార్తలు