*నర్సింహాపురంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు*

మునగాల, సెప్టెంబర్ 29(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామంలో ఉన్న శ్రీకోదండరామ స్వామి కళ్యాణ మండపం ప్రాంగణం వద్ద బతుకమ్మ ఐదో రోజైన అట్ల బతుకమ్మ పండుగను గురువారం గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సొంతంగా బతుకమ్మలను ఏర్పాటు చేసి సాంప్రదాయ పద్ధతిలో పాటలను పాడుతూ బతుకమ్మ విశిష్టతను కథ రూపంలో నేటితరం యువతకి  ప్రాచీన సాంప్రదాయాలను తెలియపరిచే విధంగా  ఆడిపాడుతూ ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ అల్లి పద్మ, ముడుంబై గాయత్రి వేమూరి రమాదేవి, అయినాల సునంద , బాణాల‌ మానస ఇందిర, దుర్గ ‌‌ విజయ, నాగమణి , సుజాత, అశ్విని, అంజలి, సీతామహాలక్ష్మి, జయమ్మ, ప్రసన్న, త్రివేణి, గౌతమి, కృష్ణవేణి, బొమ్మ చిన్నవెంకన్న, అల్లి చిన్నరామయ్య, అల్లి కనకారావు, బాణాల శ్రీను,  లింగయ్య, వాసు తదితరులు పాల్గొన్నారు.