నర్సీపట్నంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చెయ్యాలంటూ వినతిపత్రం
విశాఖపట్నం ఫిబ్రవరి 18 (జనంసాక్షి బ్యూరో) :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వున్న ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా విభజించే కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి పట్టణం గ్రేటర్ విశాఖపట్నంలో ఉన్నందున నర్సీపట్నంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయుట చెయ్యాలంటూ శుక్రవారం విశాఖపట్నం కలెక్టరేట్ లో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ , ప్రజాప్రతి నిధుల బృందం జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ ను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న 25 పార్లమెంటు నియోజకవర్గాలను 26 జిల్లా కేంద్రములుగా ఏర్పాటు చేస్తున్నందున అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంనకు అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే క్రమంలో నర్సీపట్నం ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయవలసినదిగా కలెక్టర్ ను కొరడడం జరిగిందన్నారు.
అనకాపల్లి పట్టణమంతా జీవీఎంసీ , విశాఖపట్నం పరిధిలో ఉందన్నారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారుగా 20,4,699 ఓటర్లు యున్నాయని. అందులో అనకాపల్లి టౌన్ లో ఉన్న 86,612 మరియు అనకాపల్లి రూరల్ లో ఉన్న కొప్పాక గ్రామంలో 1808, రాజాపాలెం, కె.ఎస్.ఆర్.పేట, సిరసపల్లి లో 4578, వల్లూరు, గొల్లవానిపాలెం, ఎరుకువానిపాలెం లో 1857, డి. శాసపువానిపాలెం గ్రామంలో 3980ఓటర్లు, మొత్తం 98,835 మంది ఓటర్లు సుమారుగా 50% మంది ఓటర్లు గ్రేటర్ విశాఖపట్నం పరిధిలో ఉన్నారన్నారు. అనకాపల్లిను జిల్లా కేంద్రంగా చేసినట్లయితే విశాఖపట్నం, అనకాపల్లి రెండూ జి.వి.ఎం.సి. పరిధిలోనే జిల్లా కేంద్రములుగా వుంటాయియని కావున నర్సీపట్నం ను జిల్లా కేంద్రంగా చేయాలన్నారు. అంతేకాకుండా నర్సీపట్నం లో ఉన్న వివిధ సంఘాలైన
వాసవీ కళ్యాణ మండప సంఘం, నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా, స్టార్స్ ఫౌండేషన్ సొసైటీ, శారదానగర్, నర్సీపట్నం,శ్రీ విజయ లక్ష్మీ దుర్గ ప్రయివేట్ ఎలెక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నర్సీపట్నం, విశాఖ డిస్ట్రిక్ట్ విశ్వ బ్రాహ్మిణ్ సంఘం, నర్సీపట్నం,ప్రోగ్రెసివ్ రికగ్సైజ్డ్ టీచర్స్ యూనియన్ పి ఆర్ టి యు , ఏ.పి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యూనిట్. రోటరీ క్లబ్, నర్సీపట్నం. నర్సీపట్నం క్లబ్ ( సిటీ క్లబ్ ), నర్సీపట్నం,
శ్రీ పద్మశాలీ సంక్షేమ సేవా సంఘం, నర్సీపట్నం, క్షత్రియ పరిషత్, శారదానగర్, నర్సీపట్నం,
జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్, నర్సీపట్నం,
.ఎన్.టి.ఆర్. మినీ స్టేడియం వాకర్స్ హెల్త్ & వెల్ఫేర్ అసోసియేషన్, నర్సీపట్నం, అఫిలియేటడ్ ప్రయివేట్ జూనియర్ కాలేజీస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఏపీ జే ఎమ్ ఏ , నర్సీపట్నం,
సర్సీపట్నంను జిల్లా కేంద్రంగా చేయుటకు పరిశీలన చేయవలసినదిగా కోరుతూ లేఖలు
తనకు వినతిపత్రలు అందజేశారని వాటిని కూడా కలెక్టర్ కు అందజేయడం జరిగిందన్నారు.
సర్సీపట్నం ను జిల్లా కేంద్రముగా ఏర్పాటు చేసినట్లయితే వెనుకబడిన ప్రాంతమైన మా ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా, ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం ను ఆనుకుని వున్న పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుటకు దోహదపడగలరని తెలియ జేస్తూ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం లో ఉన్న నర్సీపట్నం ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయవలసినదిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అంకంరెడ్డి జమీల్ , మున్సిపల్ చైర్మన్ గుడబండి ఆదిలక్ష్మి , జెడ్పీటీసీ గిరిబాబు గారు జెడ్పీటీసీ పెట్ల సత్యవేని, ఎంపిపి లక్ష్మణమూర్తి ఎంపిపి గజ్జెలపు మణి కుమారి ,ఎంపిపి సుర్ల రాజేశ్వరి, ఎంపిపి రుత్తల సత్యనారాయణ , వైస్ ఎంపిపి పైల సునీల్ , వైస్ ఎంపిపి ఇన్నం రత్నం, వైస్ ఎంపిపి రాజారావు ,చైర్మన్ గొలుసు నరసింహమూర్తి , వైస్ చైర్మన్ తమారాన అప్పలనాయుడు, వైస్ఎంపిపి రాజారావు, నాతవరం పార్టీ అధ్యక్షుడు శెట్టి నూకరాజు ,మాకవరపాలెం పార్టీ అధ్యక్షుడు రుత్తల వాసు ,పెట్ల భద్రాచలం, రెల్లి హక్కుల పోరాట ఐక్య వేదిక యర్రంశెట్టి పాపారావు తదితరులు పాల్గొన్నారు.