నలంద పాఠశాలనుసీజ్ యాలని.విద్యార్థి సంఘాల ధర్నా.

నలంద పాఠశాలనుసీజ్ యాలని.

విద్యార్థి సంఘాల ధర్నా.

-ఎంఇఓ కార్యాలయం,నలంద స్కూల్ ఎదుట

-విద్యార్థి సంఘాల నాయకులు పంతం విజయేందర్, వెలిశాల శ్యామ్

తొర్రుర్ 15 అక్టోబర్ (జనంసాక్షి )
డివిజన్ కేంద్రంలో
శ్రీ చైతన్య ముసుగులో ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న నలంద పాఠశాలను సీజ్  చెయ్యాలని,యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని,ఎస్సి జనసంఘం విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు పంతం విజయేందర్,టి యస్ యఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్యామ్ విద్యార్థులతో కలిసి తొర్రుర్ ఎంఇఓ కార్యాలయం,మరియు నలంద పాఠశాల ఎదుట శనివారాం ధర్నా చేపట్టారు,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంత్సరాలుగా ఎలాంటి పర్మిషన్ లేకుండా శ్రీ చైతన్య ముసుగులో నడుస్తున్న నలంద పాఠశాల పై చర్యలు తీసుకోకుండా అధికారాలు జాప్యం చేస్తు,యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నరని అన్నారు,జిల్లా ఉన్నత ధికారులు తక్షణమే స్పందించి అనుమతిలేని నలంద పాఠశాలని సీజ్ చేసి,600 విద్యార్థులకు న్యాయం చెయ్యాలని,యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో గణేష్,సంపత్, శ్రీనివాస్,సురేష్,నగేష్,నవీన్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు


Sent from Email.Avn for mobile

Attachments area