నేడు ఇంటర్ ఫలితాలు

ఏప్రిల్ 12 (జనం సాక్షి )ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితారాణా ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్టు ఇంటర్‌బోర్డు వర్గాలు వెల్లడించాయి.తొలుత మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేస్తామని తెలిపిన అధికారులు, ఆ తర్వాత 11గంటలకే ముహూర్తాన్ని ఖరారు చేశారు. వాస్తవానికి ముఖ్యమంత్రి చేతులు మీదుగా రిలీజ్‌ చేయించాలని విద్యాశాఖ అధికారులు భావించినప్పటికీ సమయాభావం వల్ల వీలుకాలేదని తెలిసింది.

ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

ఇంటర్‌ ఫలితాలను వాట్సాప్‌లోనూ చెక్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు 80969 58096 సెల్‌ నంబర్‌కు ‘హాయ్‌’ అని సందేశం పంపాలి. మెనూలో బీఐఈ ఎగ్జామ్‌ రిజల్ట్స్‌ అని టైప్‌ చేయాలి. వ్యక్తిగత వివరాలు, హాల్‌టికెట్‌ నంబర్‌, ఫస్టియర్‌/సెకండియర్‌, జనరల్‌/వొకేషనల్‌ స్ట్రీమ్‌ ఆప్షన్లు ఇస్తే వెంటనే ఫలితాలు ప్రత్యక్షమవుతాయి. ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వెబ్‌సైట్లలోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.

 

Referen