నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రదమాం

5

-10 మంది మృతి

– సీఎం దిగ్భ్రాంతి

– ఘటనా స్థలానికి మంత్రులు

నల్లగొండ,అక్టోబర్‌7(జనంసాక్షి):

మరికాసేపట్లో గమ్యం చేరుదామనుకుంటున్న తరుణంలో ఓ లారీ మృత్యురూపంలో వచ్చి వారిని యమపురికి తీసుకుని వెళ్లింది. ఊహించని ఘటనతో ఎందరో అమయాక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.  నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 10మంది మృతి చెందారు.  మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరో 5గురి పరిస్థితి విషమంగా ఉందని 108 సిబ్బంది తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారు ఉన్నట్లు సమాచారం. రామన్న పేట మండలం, ఇద్రపాలనగరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. నార్కెట్‌ పల్లి డిపోకు చెందిన బస్సు భువనగిరి నుండి నల్గొండకు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన ఓ లారీ మలుపువద్ద వేగంగా ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ తో పాటు 10 మంది చనిపోయారు. ప్రమాదంలో బస్సు నుజ్జుయ్యింది. క్షతగాత్రులను దగ్గరల్లోని రామన్నపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  నార్కెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెం. ఏపీ 20 జడ్‌ 2270. భువనగిరి నుంచి నల్గొండకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బస్సు తుమ్మలగూడెం చేరుకోగానే వేగంగా వచ్చిన లారీ.. బస్సును బలంగా ఢీ కొంది. దీంతో ఆర్టీ బస్సు పల్టీ కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. అంతా కకావికలమైపోయారు. నిముషాల వ్యవధిలో ఆ ప్రాంతం రక్తసిక్తమైపోయింది. బస్సు సీట్లకింద, కిటీకీ అద్దాల్లో చిక్కుకుని చాలా మంది నుజ్జు నుజ్జు అయిపోయారు. మృత దేహాలు, గాయపడ్డవారి ఆర్తనాదాలతో అక్కడి వాతావరణం బీభత్సంగా మారిపోయింది. ప్రమాదంతో అప్రమత్తమైన ప్రయాణీకులు, స్థానికులు, పోలీసులు 108 వాహనంలో బాధితులను నార్కెట్‌పల్లి, రామన్నపేట ఆస్పత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని కామినేని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి మృత దేహాలను రామన్నపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంమంతా హృదవిదారకరంగా మారింది. సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.  సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలు బస్సు శిథిలాల కింద చిక్కుకుపోవడంతో సంఘటనాస్థలంలో భయానక వాతావరణం చోటుచేసుకుంది. కొందరు ప్రయాణికులు ఈ ప్రమాదానికి భయభ్రాంతులై స్పృహ తప్పి పడిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. రోడ్డుప్రమాదం ప్రాంతంలో సహాయచర్యలు కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అధికారులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టినట్లు తెలిపారు. క్షతగాత్రులను రామన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై సమగ్ర

విచారణ చేపట్టనున్నట్లు కలెక్టర్‌ స్పష్టం చేశారు.

ప్రమాదంపై సీఎంగ్భ్భ్రాంతి

నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయంపై  సీఎం కేసీఆర్‌ తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాద మృతులకు సీఎం సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు సహాయక చర్యలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితులు పర్యవేక్షించాలని మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీష్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. ఈ మేరకు సిఎం అసెంబ్లీలో ప్రకటన చేశారు. ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం ఆందించాలన్నారు. కొందరిని కామినేని ఆస్పత్రికి తరలించారన్నారు. వారికి ప్రభుత్వ ఖర్చుతోనే సాయం అందిస్తామన్నారు. అలాగే మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ¬మంత్రి నాయిని వారికి సహాయంనకు సంబంధించి ప్రకటన చేస్తారన్నారు. అలాగే ఆర్టీసీ కూడా లక్ష రూపాయల ప్రమాద భీమా ఇస్తుందన్నారు. సఇక సిఎం ఆదేశాలతో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి ఘటనాస్థలికి బయల్దేరారు. ఇప్పటికే అధికారులతో మాట్లాడిన మంత్రులు సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆ జిల్లా కలెక్టర్‌ కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.