నల్లధనంపై ఐటీ కొరడా

న్యూఢిల్లీ :  నల్లధనంపై ఆదాయపు పన్ను శాఖ విరుచుకుపడుతోంది. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత రెండో దశ చర్యలను చేపట్టింది. 60 వేల మందికి నోటీసులు జారీ చేసింది. 1300 మంది హై రిస్క్ వ్యక్తులను గుర్తించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం వీరు భారీగా నగదును జమ చేసినట్లు గుర్తించింది. 6 వేల లావాదేవీలపై నిశితంగా నిఘా పెట్టింది. దాదాపు 18 లక్షల మంది నిర్వహిస్తున్న లావాదేవీలను పరిశీలిస్తోంది.