నల్లధనం వెలికితీస్తామని యోగా చేయమంటున్నారు
పాట్నా ఆగష్టు 27 (జనంసాక్షి):
ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం విఫలమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వంపై యువతకు రానురాను విశ్వాసం సన్నగిల్లుతోందని చెప్పారు. బీహార్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మోదీ ప్రభుత్వం విమర్శలు చేశారు. ఇదే వేధిక నుంచి ఢిల్లీలో రానున్న కాలంలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని పరోక్షంగా చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు
ముందు విదేశాల్లో ఉన్న నల్లధనం మొత్తాన్ని తిరిగి భారత్‌కు తెప్పిస్తామన్న మోదీ..
అధికారంలోకి వచ్చాక మాత్రం యోగా చేయమంటున్నారని ఆరోపించారు. ఎలాంటి ఫలితం ఇవ్వని స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రచారం కోసం కోట్ల రూపాయలు వెచ్చించారని విమర్శించారు. దీనివల్ల కనీసం ఒక్క వీధి కూడా శుభ్రంగా కనిపించడంలేదని కేజ్రీవాల్ చెప్పారు. బీహార్ ప్రజలు ఎలాంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలని ప్రశ్నించగా ప్రస్తుతం రెండు మోడల్ ప్రభుత్వాలు ఉన్నాయని అందులో ఒకటి ఢిల్లీ ప్రభుత్వం కాగా మరొకటి కేంద్రప్రభుత్వం అని ఇందులో ఎలాంటి తరహా ప్రభుత్వాన్ని కోరుకుంటారో ఢిల్లీ ప్రజలే నిర్ణయించుకోవాలని తెలిపారు.